పాత కార్లకు భారీ డిమాండ్‌.. ఒక్కో కారుకు రూ. 300 కోట్లకు పైనే !!

పాత కార్లకు భారీ డిమాండ్‌.. ఒక్కో కారుకు రూ. 300 కోట్లకు పైనే !!

Phani CH

|

Updated on: Apr 22, 2023 | 9:52 AM

కాలం గడిచే కొద్దీ విలువ తగ్గడం కాదు.. పెరుగుతూ పోతోంది. ఖరీదైన గత కాలం నాటి కార్లకు వేలంలో పలికిన ధరలను చూసి షాకవ్వాల్సిందే. 1962 నాటి ఫెరారీ 250 జీటీవో కారు తెగ శబ్ధం చేస్తోందని భార్య గొడవ పెట్టడంతో 1972లో ఓ యజమాని దాన్ని విక్రయించేశాడు.

కాలం గడిచే కొద్దీ విలువ తగ్గడం కాదు.. పెరుగుతూ పోతోంది. ఖరీదైన గత కాలం నాటి కార్లకు వేలంలో పలికిన ధరలను చూసి షాకవ్వాల్సిందే. 1962 నాటి ఫెరారీ 250 జీటీవో కారు తెగ శబ్ధం చేస్తోందని భార్య గొడవ పెట్టడంతో 1972లో ఓ యజమాని దాన్ని విక్రయించేశాడు. కానీ, ఓ 50 ఏళ్లు గడిచిన తర్వాత అదే కారుకు పలికిన ధర వింటే షాక్ కు గురవ్వాల్సిందే. 2018లో ఇదే మోడల్ కారు వేలంలో 48 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. మన రూపాయిల్లో అయితే సుమారుగా 400 కోట్ల రూపాయలు. 1955 నాటి మెర్సెడెజ్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ కూప్ 149 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు ఇప్పుడు పాతం కాలం నాటి వింటేజ్ కార్లపై భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గడిచిన దశాబ్ద కాలంలో వీటి ధరలు 185 శాతం పెరిగాయి. గత పదేళ్లలో లగ్జరీ వైన్, వాచీలు, ఆర్ట్ ధరలను మించి వింటేజ్ కార్ల ధరలు పెరిగాయి. వింటేజ్ కార్ల తర్వాత అంతగా ధరలు పెరిగింది పాతం కాలం నాటి విస్కీలకే. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ 2023 వెల్త్ రిపోర్ట్ వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదేళ్ల చిన్నారికి మెర్సిడెస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు

పిట్ట బావుందని ముట్టుకున్నారో అంతే సంగతులు.. క్షణాల్లో మృతి

విడాకుల సెలబ్రేషన్స్‌.. పెళ్లి బట్టలు తగులబెట్టి సంబరాలు

ఎల్లుండి RRR టీమ్‌తో అమిత్‌షా తేనీటి విందు

Ram Pothineni: పూరీ ఈజ్‌ బ్యాక్‌.. ఇస్మార్ట్ రాపోతో ఫిల్మ్

 

Published on: Apr 22, 2023 09:52 AM