చెరువు గట్టుపై భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు

Updated on: Oct 11, 2025 | 3:55 PM

ఓ ఊర్లోని గ్రామస్తులంతా చెరువు గట్టుమీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో అటుగా ఓ అనుకోని అతిథి అక్కడికి వచ్చింది. ఆ గెస్ట్‌ను చూడగానే అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారు. ఒక్క ఉదుటన అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని పద్మపోఖరి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామ సమీపంలోని చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఇంతలో ఆ చెట్టు కిందనుంచి పక్కనే ఉన్న చెరువు వైపు ఓ పెద్ద కింగ్‌ కోబ్రా పాకుతూ వెళ్తుండడం చూశారు. దాదాపు 14 అడుగుల పొడవున్న ఆ పామును చూసి ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, వెంటనే స్నేక్ క్యాచర్‌ను వెంటపెట్టుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువు వైపు వెళ్తున్న 14 అడుగుల కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత దానిని సిమిలిపాల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా వదిలిపెట్టారు. 14 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా కనిపించడం.. అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అక్కడున్నవారు ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mukesh Ambani: దేశీయ కుబేరుడిగా మళ్లీ అంబానీ.. జాబితాలో ఆరుగురు తెలుగోళ్లు

వారి ఖాతాల్లో లక్ష చొప్పున జమ.. రికవరీకి అధికారుల తంటాలు

మాజీ ఎమ్మెల్యే పేరుతో మాయలేడి అరాచకం

భారీ క్రేన్‌తో సహాయంతో ఆస్పత్రికి వ్యక్తి తరలింపు !! ఎందుకిలా చేశారో తెలుసా ??

NRI Marriages: అమెరికా పెళ్లి సంబంధాలపై తగ్గుతున్న మోజు