Viral Video: బావిలో నుంచి వింత శబ్ధాలు !! సీన్ కట్ చేస్తే !!
బావిలో పడిన చిరుతను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన ఒడిశాలోని సంబాల్‌పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్‌లో చోటుచేసుకుంది.
బావిలో పడిన చిరుతను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన ఒడిశాలోని సంబాల్‌పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్‌లో చోటుచేసుకుంది. హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి చిరుతపులి ఆహారం వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది. బావి లోతుగా ఉండటంతో పాటు నీళ్లు కూడా ఉండటంతో పైకి ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో నిచ్చెన సహాయంతో పులిని బయటకు తీశారు అటవీశాఖ అధికారులు. అయితే.. నిచ్చెన సాయంతో పైకివచ్చిన చిరుత వెనక్కి చూడకుండా అడవిలోకి పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్షి గూడు కడుతుండగా ఎప్పుడైనా చూశారా ?? విశ్వకర్మను మించిన నైపుణ్యం
హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల చిన్నారిని ఇలా ఎండలో..
క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు.. RBI అనుమతి