Viral Video: విదేశాల్లో తారక్‌ అభిమానుల హంగామా మాములుగా లేదుగా.. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఎలా వెల్‌కమ్‌ చెప్పారో చూడండి.

|

Mar 11, 2022 | 7:39 PM

Viral Video: ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) ఈ సినిమా కోసం యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌లు (RamCharan) హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాపై...

Viral Video: విదేశాల్లో తారక్‌ అభిమానుల హంగామా మాములుగా లేదుగా.. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఎలా వెల్‌కమ్‌ చెప్పారో చూడండి.
Ntr Fans
Follow us on

Viral Video: ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) ఈ సినిమా కోసం యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌లు (RamCharan) హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక చెర్రీ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా అయితే మాములుగా లేదు. సినిమా వడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో అభిమానులు అప్పుడే హల్చల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ అభిమానుల సందడికి అయితే హద్దులే లేకుండా పోయింది. విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ చేస్తున్న సందడి చూస్తుంటే వావ్‌ అనకమానరు.

తాజాగా కెనెడాకు చెందిన తారక్‌ అభిమానులు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు వెల్‌కమ్‌ చెప్పిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే కెనాడాలో ఉన్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తాజాగా వినూత్నంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌కు తెర తీశారు. కెనడాకు చెందిన కొంత మంది యువకులు కార్లతో ‘RRR’, ‘NTR’ పేర్లు వచ్చేలా డిజైన్‌ చేశారు. దీనంతటినీ డ్రోన్‌ కెమెరాల్లో బంధించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియోకు ఇచ్చిన ఆర్‌ఆర్ఆర్ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. వీడియో చివర్లో అభిమానులంతా కలిసి తారక్‌కు ఆల్‌దిబెస్ట్‌ చెబుతూ వీడియోను ముగించారు. ఆర్‌ఆర్‌ఆర్‌, ఎన్టీఆర్‌ క్రేజ్‌కు అద్దం పడుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

 

ఇదిలా ఉంటే ఈ నెల 25న విడుదలకు సిద్ధంగా ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ , తమిళ్ భాషలలో విడుదల చేయనున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇక ఆలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. కొత్త కస్టమర్ల నిలిపివేత

IND vs SL: అనిల్ కుంబ్లే రికార్డుపై కన్నేసిన అశ్విన్.. బెంగళూరు టెస్టులో మరో 7 వికెట్లు తీస్తే..

Car Prices Hike: మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమైన ఆటోమొబైల్ కంపెనీలు..!