North Korea: వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!

North Korea: వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!

Anil kumar poka

|

Updated on: Sep 07, 2024 | 7:45 AM

నార్త్ కొరియాను గత నెలలో వర్షాలు ముంచెత్తాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. సుమారు 4 వేల మంది చనిపోయారని, 15 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులకు మరణశిక్ష విధించారు.

నార్త్ కొరియాను గత నెలలో వర్షాలు ముంచెత్తాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. సుమారు 4 వేల మంది చనిపోయారని, 15 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులకు మరణశిక్ష విధించారు. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి ఉరి శిక్ష విధించినట్లు తాజాగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.

వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యటించారు. మోకాలి లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు. ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ నష్టానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ఛాగాంగ్ ప్రావిన్స్ మాజీ కార్యదర్శి సహా మొత్తం 30 మంది ఉన్నతాధికారులకు కిమ్ మరణ శిక్ష విధించారని, గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.