అతడి ఆచూకీ చెప్పినవారికవ ₹10లక్షలు..

|

Mar 11, 2024 | 5:16 PM

బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో NIA దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులోభాగంగా బుధవారం కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈమేరకు జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన యావత్‌ దేశాన్ని కలవరపెట్టింది.

బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో NIA దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులోభాగంగా బుధవారం కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈమేరకు జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన యావత్‌ దేశాన్ని కలవరపెట్టింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ -NIAకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు RDX ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. వేరే లెవల్‌.. మైనస్ 25 డిగ్రీల్లో మంచులో పెళ్లి

ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు !! సర్జరీ చేసి చేతులను అతికించారు

సోదరి ఎగ్జామ్​ కోసం సాహసం.. మంచులో ‘రోడ్డు’ వేసిన సోదరుడు

200 సార్లు టీకా వేయించుకున్న వ్యక్తి.. పరీక్షించి షాక్‌ తిన్న శాస్త్రవేత్తలు

Follow us on