Viral Video: వామ్మో నాకొద్దు..! ట్రాఫిక్‌ జామ్‌ ఆగిన పెళ్లి కారు.. దిగి వరుడు పరుగో పరుగు..

| Edited By: Phani CH

Mar 24, 2023 | 8:52 AM

కొత్తగా పెళ్లి చేసుకున్న జంట చర్చి నుంచి తిరిగి వస్తుండగా వారి కారు మహాదేవపుర వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంది. మార్గమధ్యంలో కారు తలుపు తెరుచుకుని వరుడు పారిపోయాడు.

బెంగళూరులో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి మరునాడే వధువును వదిలేసి పారిపోయడు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట చర్చి నుంచి తిరిగి వస్తుండగా వారి కారు మహాదేవపుర వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంది. మార్గమధ్యంలో కారు తలుపు తెరుచుకుని వరుడు పారిపోయాడు. అతడి భార్య కారు దిగి వెంబడించడానికి ప్రయత్నించింది. కానీ అతడిని పట్టుకోలేకపోయింది. మహిళ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వరుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఫిబ్రవరిలో చోటుచేసుకుంది.వారి పెళ్లయ్యాక, వరుడు తన మాజీ ప్రియురాలు తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని వధువుకు తెలిపాడు. కాగా తాను, తన కుటుంబం అతనికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చింది. పెళ్లికి ముందే వరుడు తన వ్యవహారం వధువుకు తెలపడమేకాక, ఆ మాజీ ప్రియురాలిని వదిలివేస్తానని కూడా చెప్పాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వధువు .. ప్రియురాలు వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. తనని ఎక్కడ బజారుకీడుస్తుందోనని అతను పారిపోయాడని పేర్కొంది. వరుడు గోవాలో తన తండ్రి నడిపే మ్యాన్‌పవర్ ఏజెన్సీలో పనిచేస్తుండే వాడు. అప్పుడే అతడు తన ప్రియురాలితో వ్యవహారం నడిపాడు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. తమ కంపెనీలో ఓ డ్రైవరు భార్య కూడా. ఆ కంపెనీలో వరుడు క్లర్క్‌గా పనిచేసేవాడు. కానీ అతడి కుటుంబం అతడు వ్యవహారం నడిపిస్తున్నాడని తెలిసి, వధువుతో పెళ్లి ఏర్పాటుచేసారు. వధువుకు కూడా పెళ్లి కొడుకు వ్యవహారం నడిపిన సంగతి ముందే తెలుసు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 24, 2023 07:20 AM