గలీజుగా న్యూయార్క్‌ సబ్‌వే.? వీడియో

Updated on: Apr 29, 2025 | 3:47 PM

అమెరికాలోని న్యూయార్క్‌ పేరు వింటేనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరమని ఆకాశాన్నంటే ఆకాశహర్మ్యాలు గుర్తొచ్చి దాన్నో స్వర్గంలా భావిస్తారు. హాలీవుడ్‌ సినిమాల్లో న్యూయార్క్‌ను అందంగా చూపించడం ఇందుకు కారణం. భారతీయులు కూడా న్యూయార్క్‌లో పర్యటించాలని, అక్కడి అందమైన ప్రదేశాల్లో విహరించాలని కలలు కంటారు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమేనని ఢిల్లీకి చెందిన యూట్యూబర్‌ నిరూపించాడు. న్యూయార్క్‌లో సబ్‌వేలు ఎంత దారుణంగా ఉంటాయో వీడియోలో చూపించాడు ఢిల్లీ యూట్యూబర్‌.

 అతను షేర్ చేసిన వీడియోలో , న్యూయార్క్‌ ఊహించినంత శుభ్రంగా లేదని ముఖ్యంగా న్యూయార్క్‌ సిటీలోని సబ్‌వేలు స్లమ్స్‌ కంటే అధ్వానంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. మెట్రో మానవ వ్యర్థాలతో పేరుకుపోయింది, ఎలుకలతో నిండిపోయింది. ప్రస్తుతం అమెరికా అంతటా సోలో ట్రిప్‌ చేస్తున్న ఢిల్లీ యూట్యూబర్ లవ్ సోలంకి రుద్రాకాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ ను పోస్ట్ చేశాడు, ఇది న్యూయార్క్ ప్రసిద్ధ మెట్రో వ్యవస్థ దుస్థితిని బయటపెట్టింది. అతని వీడియో సినిమాల్లో తరచుగా చూపించే పరిశుభ్రమైన మెట్రోకు భిన్నంగా ఉంది. ఈ రీల్ ఇప్పుడు వైరల్ అవుతూ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం 

దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే వీడియో?

పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో