Viral Video: రూటు మార్చిన దొంగలు.. ముసుగులు ధరించి
దొంగలు కొత్త పద్ధతులతో చోరీలకు పాల్పడుతున్నారు. ముసుగులు ధరించి సీసీ కెమెరాలకు దొరక్కుండా ఉంటున్నారు. ఇళ్లలో పనివాళ్లుగా చేరి, అడ్రస్ అడిగే నెపంతో దోపిడీలు చేస్తున్నారు. చింతలపూడి, నూజివీడు సంఘటనలు దీనికి నిదర్శనం. ప్రజలు తమ ఆస్తుల రక్షణకు బాధ్యత వహించాలని, మోషన్ డిటెక్షన్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
దొంగలు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. ఇళ్లలో పనివాళ్లలా చేరి ఒంటరిగా ఉన్నప్పుడు నిస్సహాయులను చేసి యజమానులపై దాడి చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు కొందరు. ఇళ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌గా చేసుకొని మంచినీళ్లు కావాలనో..ఏదో అడ్రస్ కావాలనో వారిని మాటల్లో దింపి అదనుచూసి వారి మెడలో నగలు కొట్టేసేవాళ్లు మరికొందరు. ఇప్పుడు ముసుగులు ధరించి సీసీ కెమెరాలకు కూడా దొరక్కుండా చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడులో ఓ వ్యాపార సంస్థలో చోరీ జరిగింది. రూ.35 లక్షల విలువైన బంగారం పోయిందని యజమాని ఫిర్యాదులో తెలిపాడు. దుకాణం పక్కన, ఎదురుగా సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటి గురించి ముందే తెలిసిన ఆ దొంగ.. ఆ రెండింట్లో పడకుండా తన ముఖానికి ముసుగు ధరించి చోరీ చేశాడు. అలాగే, చింతలపూడిలో ఓ ఫైనాన్స్ కంపెనీలో ఆభరణాల ఆడిట్‌కు వెళ్లిన ఆడిటరే ఏకంగా ఆభరణాలను పట్టుకెళ్లిపోయారు. వాటి విలువ రూ.2 కోట్ల పైమాటే. అతను అక్కడ ఉన్న కెమెరాలో పడలేదు. ఇలా దొంగలు కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారు. ముఖాలకు ముసుగులు వేసుకుని కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఎక్కడా సీసీ కెమెరాల్లో పడకుండా ఊరు దాటి చాలాదూరం వెళ్లే వరకూ ముసుగులు తీయడం లేదు. దొంగలు ఇలా రూటుమార్చి కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఇంతకు ముందు ఇలాంటి నేరాలు జరగలేదు. ప్రధానంగా చింతలపూడి ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని పట్టుకెళ్లిన వ్యక్తి కాకినాడ వరకు ముసుగు తొలగించలేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు… ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రతీ దానికీ పోలీసులదే రక్షణ బాధ్యత అని తేలికగా తీసుకోవద్దని తెలిపారు. ఇళ్లల్లో పెద్ద మొత్తంలో నగదు, విలువైన బంగారం ఉన్నప్పుడు వాటి రక్షణ బాధ్యత కూడా వారిదే అని చెప్పారు. కొంతమొత్తం ఖర్చుచేసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలు జరిగినప్పుడు దొంగలను త్వరగా పట్టుకోవచ్చని సూచిస్తున్నారు. రూ.5 నుంచి 6 వేల చిన్న మొత్తంతో మోషన్ డిటెక్షన్ కెమెరాలొస్తాయని, వాటిని ఏర్పాటు చేసుకుంటే వాటితో అలర్ట్ మెసేజ్ వస్తుందని, వాటిలో నమోదయ్యే కదలికలను సెల్‌ఫోన్‌లో చూసుకోవచ్చన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల భక్తులకు అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనాలపై అప్ డేట్
Chandrababu Naidu: చంద్రబాబు నిద్రను డిసైడ్ చేసేది ఈ ఆరా రింగే !! స్పెషల్ ఏమిటో తెలుసా ??
రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షలు ఎప్పుడంటే
