అంతరిక్షంలో మరో సంచలనం.. అంగార‌కునిపై ఆక్సిజ‌న్‌..

అంగార‌కునిపై మ‌నిషి ఆవాసాల‌ను ఏర్పాటు చేయ‌డానికి వీలుగా ఒక్కో అడుగూ ముందుకు ప‌డుతోంది. అంగార‌కునిపై భూమి త‌ర‌హాలోనే వాతావ‌ర‌ణం ఉండ‌టంతో.. ఒక‌ప్పుడు అక్కడా ఏదో ఒక స్థాయిలో జీవం ఉంద‌ని శాస్త్రవేత్తల అంచ‌నా. అయితే ఇప్పుడు అదంతా నిశ్శబ్దమైన శ్మశానంలా మారిపోయిందంటున్నారు. అక్కడ వాతావ‌ర‌ణం ఉన్నప్పటికీ మ‌నుషుల‌కు త‌గినంత ఆక్సిజ‌న్ అందుబాటులో లేదు. మాన‌వ ఆవాసాల‌ను అంగారకుడిపై ఏర్పాటు చేయ‌గ‌లిగితే భూమిపై నుంచి ఆక్సిజ‌న్ను తీసుకెళ్లడం కష్టసాధ్యం.

అంతరిక్షంలో మరో సంచలనం.. అంగార‌కునిపై ఆక్సిజ‌న్‌..

|

Updated on: Sep 11, 2023 | 7:38 PM

అంగార‌కునిపై మ‌నిషి ఆవాసాల‌ను ఏర్పాటు చేయ‌డానికి వీలుగా ఒక్కో అడుగూ ముందుకు ప‌డుతోంది. అంగార‌కునిపై భూమి త‌ర‌హాలోనే వాతావ‌ర‌ణం ఉండ‌టంతో.. ఒక‌ప్పుడు అక్కడా ఏదో ఒక స్థాయిలో జీవం ఉంద‌ని శాస్త్రవేత్తల అంచ‌నా. అయితే ఇప్పుడు అదంతా నిశ్శబ్దమైన శ్మశానంలా మారిపోయిందంటున్నారు. అక్కడ వాతావ‌ర‌ణం ఉన్నప్పటికీ మ‌నుషుల‌కు త‌గినంత ఆక్సిజ‌న్ అందుబాటులో లేదు. మాన‌వ ఆవాసాల‌ను అంగారకుడిపై ఏర్పాటు చేయ‌గ‌లిగితే భూమిపై నుంచి ఆక్సిజ‌న్ను తీసుకెళ్లడం కష్టసాధ్యం. అందుకే ప్రాణ‌వాయువును త‌యారికి సిద్ధమైంది నాసా. ఆ ఉద్దేశంతోనే 2021లో మార్స్‌పైకి ప‌ర్సెవ‌రెన్స్ రోవ‌ర్‌ను పంపింది నాసా. అందులోని మార్స్ ఆక్సిజ‌న్ ఇన్ సితు రిసోర్స్ యుటిలైజేష‌న్ ఎక్స్‌ప‌రిమెంట్ ప‌రిక‌రం విజ‌య‌వంతంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే 16వసారి నాణ్యమైన ఆక్సిజ‌న్‌ను త‌యారు చేసింది. ఈ మేర‌కు నాసా ప్రక‌టించింది. మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ త‌యారు చేసిన ఈ ప‌రిక‌రం అంచ‌నాల‌ను మించి ప‌నిచేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీర తోటలో కోతి ఫ్లెక్సీ పెట్టిన రైతు.. ఎందుకో తెలుసా ??

వీర్యం, అండం లేకుండానే పిండం.. వైద్య చరిత్రలో సంచలనం

ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లి కొడుకు.. ముహూర్తం దాటిపోతుందని..

Heart Attack Restaurant: హార్ట్‌ ఎటాక్‌ రెస్టారెంట్‌.. ఫుడ్ తినాలంటే గుండె ధైర్యం కావాలి

మనిషి మాంసాన్ని తినేస్తున్న కొత్త బ్యాక్టీరియా !! ఇప్పటికే 13 మంది మృత్యువాత

 

Follow us