ఆన్ లైన్ లో గేదె కొనుగోలు.. రూ.1.28 లక్షలు కుచ్చుటోపీ
టెక్నాలజీ యుగంలో అన్నీ ఆన్‌లైన్ మయమే. షాపింగ్ దగ్గర్నుంచి పెళ్లిళ్ల వరకూ అన్నీ ఆన్‌లైన్ లావాదేవీలే. కాలు కదపకుండా కావాల్సిన వస్తువులు నిమిషాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వినియోగదారులకు వల విసురుతున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా ఎంతోమంది మోసపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి గేదెను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయబోయి లక్షన్నర పోగొట్టుకున్నాడు.
టెక్నాలజీ యుగంలో అన్నీ ఆన్‌లైన్ మయమే. షాపింగ్ దగ్గర్నుంచి పెళ్లిళ్ల వరకూ అన్నీ ఆన్‌లైన్ లావాదేవీలే. కాలు కదపకుండా కావాల్సిన వస్తువులు నిమిషాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వినియోగదారులకు వల విసురుతున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా ఎంతోమంది మోసపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి గేదెను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయబోయి లక్షన్నర పోగొట్టుకున్నాడు. ఆనక అసలు విషయం తెలిసి లబోదిబోమన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన బాధితుడు దూబ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుతున్న తన కుమారుడు అజయ్ సెప్టెంబరు 6న మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఆన్ లైన్ లో గేదెను 65 వేల రూపాయలకు బేరం చేశాడు. అవతలి వ్యక్తి రవాణా ఖర్చులకు ముందుగా 3వేలు చెల్లించమని కోరడంతో అతనికి ఫోన్ పే చేశాడు. గేదె చిరునోములకు వచ్చిన తరువాత మిగిలి పైకం చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. కానీ మర్నాడు ఉదయం ఫోన్ చేసి గేదెను వాహనంలో ఎక్కించాం, సాయింత్రంలోగా వస్తుంది మిగతా డబ్బులు వెంటనే చెల్లించమని చెప్పడంతో తండ్రికి చెప్పకుండానే మరో 65వేల రూపాయలు ఫోన్ పే చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలో మరో సంచలనం.. అంగారకునిపై ఆక్సిజన్..
బీర తోటలో కోతి ఫ్లెక్సీ పెట్టిన రైతు.. ఎందుకో తెలుసా ??
వీర్యం, అండం లేకుండానే పిండం.. వైద్య చరిత్రలో సంచలనం
ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లి కొడుకు.. ముహూర్తం దాటిపోతుందని..
Heart Attack Restaurant: హార్ట్ ఎటాక్ రెస్టారెంట్.. ఫుడ్ తినాలంటే గుండె ధైర్యం కావాలి