అంబా అని అరిచినా పట్టించుకోని మనిషి.. కంటతడి పెట్టిస్తున్న మూగజీవుల ఆక్రందన
మనిషి కన్నీళ్లను తోటి మనుషులే తుడవని ఈ కాలంలో.. అంబా అంటే మేమున్నాం నేస్తమా అని గాయపడిన ఆవు దగ్గరకు పరుగెత్తుకొచ్చాయి తోటి ఆవులు. తీవ్ర గాయాలైన ఆవును చూసి రోధించాయి. కానీ అటుగా వెళ్లిన మనిషి వాటి బాధను చూసి కూడా సాయం చేయలేకపోయాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో సెప్టెంబరు 9న జరిగింది. వాహనం ఢీకొని రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ఒకటి మరణించగా.. మరో ఆవు రెండు కాళ్లు విరిగి అచేతనంగా పడిఉంది.
మనిషి కన్నీళ్లను తోటి మనుషులే తుడవని ఈ కాలంలో.. అంబా అంటే మేమున్నాం నేస్తమా అని గాయపడిన ఆవు దగ్గరకు పరుగెత్తుకొచ్చాయి తోటి ఆవులు. తీవ్ర గాయాలైన ఆవును చూసి రోధించాయి. కానీ అటుగా వెళ్లిన మనిషి వాటి బాధను చూసి కూడా సాయం చేయలేకపోయాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో సెప్టెంబరు 9న జరిగింది. వాహనం ఢీకొని రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ఒకటి మరణించగా.. మరో ఆవు రెండు కాళ్లు విరిగి అచేతనంగా పడిఉంది. ఆ రెండు ఆవుల వద్దకు చేరిన మరికొన్ని మూగజీవాలు రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మంచిర్యాల జిల్లా మందమర్రి లో గుర్తు తెలియని వాహనం ఢీకొని శనివారం తెల్లవారు జామున రెండు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. రహదారి పక్కనే పడిపోయి నరకయాతన అనుభవించాయి. దాదాపు నాలుగు గంటల పాటు విలవిలాడి ఆ రెండు ఆవుల్లో ఒక ఆవు మృతి చెందింది. మరో ఆవు రెండు కాళ్లు విరిగి పోవడంతో తీవ్రగాయాలతో అంబా అంబా అంటూ ఎటు కదలలేని పరిస్థితుల్లో అక్కడే తండ్లాడింది. ఆ వైపు నుండి వెళ్లిన ఏ ఒక్కరు కూడా ఆగి అయ్యోపాపం అనడం కాదు కదా కనీసం మానవత్వం తో స్పందించలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఆవును బతికిద్దాం అని ముందుకు రాలేదు. తోటి ఆవులు ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి పశువులు వాటి చుట్టు చేరి కన్నీళ్లు కార్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆన్ లైన్ లో గేదె కొనుగోలు.. రూ.1.28 లక్షలు కుచ్చుటోపీ
అంతరిక్షంలో మరో సంచలనం.. అంగారకునిపై ఆక్సిజన్..
బీర తోటలో కోతి ఫ్లెక్సీ పెట్టిన రైతు.. ఎందుకో తెలుసా ??
వీర్యం, అండం లేకుండానే పిండం.. వైద్య చరిత్రలో సంచలనం
ట్రాఫిక్లో ఇరుకున్న పెళ్లి కొడుకు.. ముహూర్తం దాటిపోతుందని..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

