అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

Updated on: Jun 21, 2025 | 12:29 PM

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ మహిళను అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి, కోడలు తన కిడ్నీ దానం చేయాలని లేదా 4 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చనందుకు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు.

వేధింపులకు తాళలేక ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. మిథన్‌పూర్‌కు చెందిన దీప్తి, 2021 ఏప్రిల్ 28న పార్థ్ ప్రషార్‌ను వివాహం చేసుకుంది. ఆమె తండ్రి పెళ్లి కోసం రూ.30 లక్షలు ఖర్చు చేశారు. అయినప్పటికీ వివాహం తర్వాత అత్తమామలు ఆమెను కట్నం విషయంలో వేధించడం ప్రారంభించారు. 2023లో పార్థ్‌కు కిడ్నీ సమస్య ఉన్నట్లు తేలడంతో, అతన్ని చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. ఈ సమయంలో తన భర్తను చూసుకోవడానికి వీలుగా పార్థ్ సోదరి ఇంట్లోనే దీప్తి మూడు నెలలు ఉంది. తర్వాత ఈ జంట ఢిల్లీలో అద్దె ఇంట్లోకి మారిపోయారు. అత్తమామలు దీప్తిని నిరంతరం వేధించారు. పార్థ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, అందుకని దీప్తి తన కిడ్నీని దానం చేయాలని లేదా రూ.4 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఈ డిమాండ్‌ను తిరస్కరించడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపారు. కొంతకాలం పుట్టింట్లో ఉన్న దీప్తి, మే 11, 2025న మళ్లీ అత్తింటికి వెళ్లగా, తమ డిమాండ్‌లు నెరవేర్చే వరకు ఇంట్లోకి అనుమతించబోమని అత్తమామలు స్పష్టం చేశారు. దీప్తి తన ఫిర్యాదులో, పెళ్లి తర్వాత అత్తమామలు నగదు, బైక్‌తో సహా వివిధ డిమాండ్‌లు చేశారని, ఆయుర్వేద షాపు కోసం రూ.7 లక్షలు అడగ్గా తన తండ్రి రూ.3 లక్షలు ఇచ్చారని తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు దీప్తి భర్త పార్థ్ ప్రషార్, అతని తల్లిదండ్రులు, సోదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్‌

దేశాన్నే ఊపేస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్‌

నా భార్య ఎవరితో పోయినా పర్లేదు.. నన్ను చంపకుంటే చాలు