అందరిలోని బైక్ లైన్ నుంచి సడెన్ గా మెయిన్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాడు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నడిపే బస్సును అతను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతని ఎడమ చేయి బస్సు వెనక చక్రం కింద పడి నలిగిపోవడంతో పాటు తెగిపోయింది. అక్కడున్న వారు ఇది చూసి షాకయ్యారు. 35 ఏళ్ల ఇస్మాయిల్ సురత్ వాళాగా గుర్తించిన అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బిఎంసి బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.