Viral Video: స్టెప్పులతో అదరగొట్టిన ముంబై పోలీస్.. సలాం కొడుతోన్న నెటిజన్లు! వైరలవుతోన్న వీడియో

సోషల్ మీడియాలో వైరల్ వీడియోల హవా ఎప్పటికీ తగ్గదు. రోజుకు ఎన్నో వీడియోలు నెట్టింట్లో దిగుమతి అవున్నాయి. వాటిలో కొన్ని విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట్లో దూసుకపోతున్నాయి. అలాంటి ఓ వీడియోను ఇప్పుడు తీసుకొచ్చాం.

Viral Video: స్టెప్పులతో అదరగొట్టిన ముంబై పోలీస్.. సలాం కొడుతోన్న నెటిజన్లు! వైరలవుతోన్న వీడియో
Viral Video

Updated on: Aug 08, 2021 | 4:55 AM

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోల హవా ఎప్పటికీ తగ్గదు. రోజుకు ఎన్నో వీడియోలు నెట్టింట్లో దిగుమతి అవున్నాయి. వాటిలో కొన్ని విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట్లో దూసుకపోతున్నాయి. అలాంటి ఓ వీడియోను ఇప్పుడు తీసుకొచ్చాం. అదిరిపోయే స్టెప్పులతో సెలబ్రిటిగా మారిపోయాడో పోలీస్ ఆఫీసర్. పాటకు తగ్గట్టే డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో నెటిజన్లకు నచ్చడంతో అది కాస్త వైరల్‌గా మారి ఆయన్నో సెలబ్రిటిగా మార్చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబయికి చెందిన పోలీస్‌ అధికారి అమోల్ యశ్వంత్ కాంబ్లే.. అప్పు అనే బాలీవుడ్‌ సినిమాలోని ‘ఆయా హే రాజా’ పాటకు డ్యాన్స్ వేశాడు. పాటకు సరిగ్గా సరిపోయే స్టెప్పులతో దుమ్ము దులపడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో పాటు ఎన్నో కామెంట్లు వచ్చి పడ్డాయి.

ఈ వీడియోపై పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ‘ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా శాంతిభద్రతలను కాపాడడం నా బాధ్యత. డ్యూటీలో భాగంగా కరోనా బారిన పడకుండా మాస్క్‌ ధరించాలని అవగాహన కల్పిస్తున్నాం. బైక్‌పై వచ్చిన ఓ యువకుడితో సరదాగా స్టెప్పులు వేశాను. హాలీడేస్‌లో నా పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేస్తూంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌‌లో 24 లక్షల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.
ఆ వీడియోను మీరూ చూడండి..

Also Read: Viral Video: ఫాంటా కూల్ డ్రింక్ పోసి ఆమ్లెట్ వేసాడు.. వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. ఇదేమి వెరైటీ ఫుడ్ రా సామి..

Viral Video: ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు

Viral Video: ఇంకా నయం వధువు కొట్టలేదు.. వరుడి స్నేహితులు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. వీడియో