Brain Dead man: బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి అవయవ దానం.. ఆపరేషన్‌ చేస్తుండగా వ్యక్తిలో కదలికలు.. అంత షాక్..

|

Sep 21, 2022 | 12:07 PM

మెరికాలోని నార్త్‌ కరోలినాలో వింత సంఘటన జరిగింది. మీడియా కథనాల ప్రకారం రియాన్ మార్లో అనే వ్యక్తి లిస్టిరియోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గత నెలలో


మెరికాలోని నార్త్‌ కరోలినాలో వింత సంఘటన జరిగింది. మీడియా కథనాల ప్రకారం రియాన్ మార్లో అనే వ్యక్తి లిస్టిరియోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గత నెలలో ఆసుపత్రిలోని ఎమెర్జెన్సీ వార్డు లో చేరాడు. అతనిని పరీక్షించిన వైద్యులు రియాన్ ను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. వాస్తవానికి.. నార్త్ కరోలినాలో ఒక వ్యక్తి మెదడు పనిచేయడం ఆగిపోయినట్లయితే.. అతను చనిపోయినట్లు ప్రకటించవచ్చు అనే చట్టం ఉంది. ఈ చట్టం ఆధారంగా.. వైద్యులు ర్యాన్ చనిపోయినట్లు ప్రకటించారు. రియాన్ మార్లో భార్య పెద్ద మనసుతో అతని అవయవాలను దానం చేయాలనుకున్నట్లు వైద్యులకు చెప్పింది. అనంతరం అవయవదాన ప్రక్రియ ప్రారంభమైంది. అయితే శస్త్రచికిత్సకు ముందు.. మేఘన్ మేనల్లుడు రియాన్‌ వద్దకు వెళ్లి.. పిల్లలతో ఆడుకుంటున్న వీడియోను ప్లే చేశాడు. అప్పుడు షాకింగ్ గా రియాన్‌ కాళ్లలో కదలిక మొదలైంది. ఈ విషయం తెలిసి మేఘన్ ఏడవడం మొదలుపెట్టింది. తన భర్త జీవించి ఉన్నాడని ఆమె నమ్మకపోయినా.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల్లో ఇలాంటివి జరుగుతాయని ఆమెకు తెలుసు. అయినప్పటికీ మేఘన్.. తన భర్తకు మళ్ళీ కొన్ని పరీక్షలు చేయించింది. పరీక్షలో రియాన్‌ బ్రెయిన్‌ డెడ్‌ కాలేదని, మెదడులో రక్త ప్రవాహం కొనసాగుతోందని వైద్యులు గుర్తించారు. అనంతరం తన భర్త రియాన్‌ వద్దకు వెళ్లి అతని చేతిని తాకింది. అతనితో మాట్లాడింది.. వెంటనే రియాన్‌ హృదయ స్పందన మొదలైంది.. ఈ విషయం మేఘన్ గుర్తించింది. వెంటనే వైద్యులు రియాన్ ను పరీక్షించి.. అతను బ్రెయిన్ డెడ్ కాదని.. కోమాలో ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. తన భర్త కళ్లు తరవాలని భార్య మేఘన్ కోరుకుంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 21, 2022 12:07 PM