Viral Video: ఆ స్కూల్లో తల్లి స్వీపర్.. ఎమ్మెల్యే హోదాలో ముఖ్య అతిథిగా కొడుకు.. వీడియో చుస్తే షాక్ అవ్వాల్సిందే..
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ తరపున మొదటిసారి పోటీ చేసి ఏకంగా సీఎం అభ్యర్థినే ఓడించి సంచలనం సృష్టించాడు లభ్సింగ్ఉగోకే. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్ చన్నీపై 37వేల మెజార్టీతో విజయం సాధించి,
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ తరపున మొదటిసారి పోటీ చేసి ఏకంగా సీఎం అభ్యర్థినే ఓడించి సంచలనం సృష్టించాడు లభ్సింగ్ఉగోకే. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్ చన్నీపై 37వేల మెజార్టీతో విజయం సాధించి, అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఒక ఎత్తైతే.. ఓ స్వీపర్ కుమారుడు ఏకంగా ముఖ్యమంత్రినే ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, లభ్ సింగ్ తల్లి ఓ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తన తల్లి స్వీపర్‌గా పనిచేస్తున్న పాఠశాలకే ముఖ్య అతిథిగా వెళ్లారు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.కొడుకు ఎమ్మెల్యేగా గెలుపొందినా తల్లి బల్దేవ్ కౌర్ మాత్రం ఇప్పటికీ స్వీపర్ వృత్తినే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏళ్ల తరబడి చేస్తున్న ఉద్యోగాన్నే కొనసాగిస్తున్నారు. కుమారుడు ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఇవేవీ పట్టించుకోకుండా ఆమె తన పని తాను చేసుకుపోతున్నారు. ‘లభ్‌సింగ్ కచ్చితంగా పంజాబ్‌లో మార్పులు తీసుకొస్తాడు. ప్రజలకు వైద్యం, విద్య అందేలా చూస్తాడు. నా కొడుకు ఎమ్మెల్యే అయినా స్వీపర్ పనిని కొనసాగిస్తా’ అని తల్లి చెప్పుకొచ్చింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

