Hen Viral Video: ఇది కదా తల్లి ప్రేమ అంటే..! వర్షంలో తడుస్తూ.. బిడ్డలకు గొడుగై..

Updated on: Mar 18, 2023 | 8:28 PM

సోషల్ మీడియాలో పుణ్యామాని చిత్ర విచిత్రాల దృశ్యాలను చూడగలుతున్నాం. తాజాగా భారీ వ‌ర్షంలో త‌న పిల్లలను కాపాడుతున్న తల్లి కోడి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో పుణ్యామాని చిత్ర విచిత్రాల దృశ్యాలను చూడగలుతున్నాం. తాజాగా భారీ వ‌ర్షంలో త‌న పిల్లలను కాపాడుతున్న తల్లి కోడి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి ప్రేమను మించినది ప్రపంచంలో ఏదీ లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. తల్లులు తమ పిల్లలకు మంచిని మాత్రమే కోరుకుంటారు. వారిటి ప్రమాదం నుండి రక్షించాలని కోరుకుంటారు. తాజాగా భారీ వ‌ర్షంలో త‌న పిల్లలను కాపాడుతున్న తల్లి కోడి వీడియోను ఐఏఎస్ అధికారి ఒకరు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇది పాత వీడియోనే కావచ్చు కానీ… చూసిన ప్రతిసారీ… ఎరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది.ఒక కోడి తన పిల్లలకు భారీ వర్షంలో ఆశ్రయం కల్పించింది. కోడిపిల్లను వర్షం నుంచి కాపాడుతూ గొడుగులా తయారైంది. ఆ భారీ వర్షంలో తాను తడుస్తున్నా.. తన బిడ్డలు తడవకుండా ఉండేందుకు అది చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోందిఇందుకు సంబంధించిన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. త‌ల్లి ఏ రూపంలో ఉన్నా త‌ల్లే.. త‌ల్లి ప్రేమ ఒక్కటే అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు తల్లి కోడి ప్రేమకు ఫిదా అవుతున్నారు. త‌ల్లి స్ధానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌ని నెటిజ‌న్లు కామెంట్స్ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 18, 2023 08:27 PM