Giraffe – Lion: సింహం నోటి నుంచి పిల్ల జిరాఫీని కాపాడిన తల్లి.. వీడియో వైరల్.

|

Mar 21, 2023 | 9:42 AM

సింహంపై జిరాఫీ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది. పిల్ల జిరాఫీ ఒంటరిగా ఉందనుకుని ఓ సింహం ఒక్కసారిగా దాడి చేసింది..

సింహంపై జిరాఫీ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది. పిల్ల జిరాఫీ ఒంటరిగా ఉందనుకుని ఓ సింహం ఒక్కసారిగా దాడి చేసింది. ఈ క్రమంలో పిల్ల జిరాఫీ పీకపట్టుకోవడంతో అది తల వాల్చేసింది. అయితే..ఆ పక్కనే ఉన్న తల్లి జిరాఫీ ఒక్కసారిగా సింహంపై లంఘించడంతో బెదిరిపోయిన మృగరాజు అక్కడి నుంచి పారిపోయింది. జిరాఫీ ధాటికి సింహం పారిపోవడం పలువురిని ఆకట్టుకోవడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.తన పిల్లను కాపాకునేందుకు ప్రాణాలకు తెగించిన తల్లి జిరాఫీ నిజంగా గొప్పదంటూ కొందరు కామెంట్ల వరద పారించారు. ‘‘తల్లి ప్రేమ ఇదే అంటూ’’ అంటూ వరుస వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే సింహం దాడిలో తీవ్రంగా గాయపడ్డ పిల్ల జిరాఫీ వాల్చిన తలను ఎత్తకపోవడాన్ని కొందరు గుర్తించారు. అది అప్పటికే మరణం అంచుకు చేరుకుని ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జీవితం అంటే ఇదేనా.. చంపడం లేదా చావడమేనా’’ అంటూ కొందరు నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే.. ప్రకృతి వీడియోల పేరిట ఇలాంటి సున్నితమైన దృశ్యాలను షేర్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీనిపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 21, 2023 09:42 AM