తల్లీ, కూతుళ్ల ప్రాణం తీసిన ఎయిర్‌ కూలర్‌

Updated on: May 13, 2025 | 5:41 PM

నిద్రపోతున్న తల్లి, కూతురును కరెంటు షాక్ తీసుకుంది. నిద్రలో ఉన్న తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం గుల్లతండాలో చోటుచేసుకుంది. రాత్రి ఉక్కపోత బరించలేక శ్యాంకబాయి అనే మహిళ పిల్లల కోసం కూలర్ ఆన్ చేసి పడుకుంది. నిద్రలో ఉండగా చిన్న కూతురు శ్రీవని కాలు కూలర్ కు తాకింది.

దీంతో ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురైంది. కరెంటు షాక్ తీవ్రతతో ఆమె కాళ్ళు కాలిపోయాయి. అయితే పక్కనే ఉన్న తల్లి శ్యాంకబాయిని కుమార్తె భయంతో గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ విద్యుత్ ఘాతానికి గురయ్యారు. దీంతో నిద్రలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే కొంచెం దూరంగా నిద్రపోయిన కుమారుడు ఉదయం నిద్రలేచి చూసేసరికి తల్లి, చెల్లి ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతి దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మద్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంటు షాక్ కారణమైన కూలర్ ఎనిమిది కావడం, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా లోకల్ మేడ్ కావడంతోనే షాక్ తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తండాలోని ఇళ్లలో కరెంటు షాక్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా రెండు ప్రాణాలు అయిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఈఈ విచారణకు ఆదేశించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా సినిమాల మీద బతుకుతూ.. మమ్మల్నే తిడతావా ?? ఛీ బుద్ది చూపించావ్ కదరా ??

అతి ప్రేమే కొంప ముంచింది !! తండ్రిగా నా భర్తకు బాధ్యత లేదు..

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

నెల రోజులు రెగ్యులర్‌గా అల్లం తినండి.. జరిగింది చూసి మీరే షాకవుతారు

తనకంటే 6 ఏళ్ల చిన్నవాడితో హీరోయిన్‌ రొమాన్స్.. అడిగితే కంఫర్ట్‌ అంటూ ఆన్సర్