వాష్‌రూమ్‌కి వెళ్దామని వెళ్లిన వ్యక్తి.. లోపల ఊహించని షాక్‌

Updated on: Jun 25, 2025 | 7:38 PM

వర్షాకాలం మొదలైంది.. పాముల సంచారం ఎక్కువైంది. ఎక్కడ చూసినా పాములే పాములు. ఇళ్లు, స్కూళ్లు, వాహనాలు ఎక్కడపడితే అక్కడ పాములు దర్శనమిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వలసాద్ జిల్లా ఛాలా ప్రాంతంలోని శ్రీరంగ్ సొసైటీ లోని ఓ ఇంట్లో ప్రమాదకరమైన విషసర్పం ప్రవేశించింది.

ఎప్పుడు ఎలా వెళ్లిందోకానీ ఆ ఇంటి టాయిలెట్‌ కమోడ్‌లో తిష్ట వేసింది. ఈ విషయం తెలియని ఆ ఇంటి యజమాని వాష్‌రూమ్‌కి వెళ్లింది. కమోడ్‌లో ఏదో కదులుతున్నట్టు అనిపించి పరిశీలించి చూసిన ఆమె ఒక్కసారిగా షాకయింది. భయంతో వెనుకకు పరుగెత్తుకొచ్చింది. ఆ మహిళ వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చింది. అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ ఎంతో చాకచక్యంగా పామును బంధించాడు. ఇండియన్ స్పెక్టకుల్ కోబ్రా అనే ఈ పాము చాలా ప్రమాదకరమైనదని స్నేక్‌ క్యాచర్‌ తెలిపారు. సుమారు ఐదు అడుగుల పొడవున్న ఆ కోబ్రాను మహామహంత్ సురక్షితంగా పట్టుకున్నారు, దాంతో ఆ కుటుంబ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. పట్టుబడిన కోబ్రాను అటవీశాఖ సూచన మేరకు అడవిలో విడిచిపెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పరగడుపున పుచ్చకాయ తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే బుర్రపాడు

రన్నింగ్‌ ట్రైన్‌లో రక్తం కారేలా కొట్టుకున్న మహిళలు !! చివరకు

నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్‌

విమానంలో రెచ్చిపోయి రచ్చ చేసిన మహిళ.. ఏంటి మావా ఇలా ఉన్నారు

లక్ అంటే ఆ జాలరిదే.. ఒక్క దెబ్బకు లక్షాధికారిని చేసిందిగా