క్రమం తప్పకుండా స్కూలుకి వెళ్తున్న కొండముచ్చు.. 100 % అటెండెన్స్‌ !!

|

Sep 22, 2022 | 9:42 AM

రోజూ పొద్దున్నే లేచి స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. స్కూలు ఎగ్గొట్టడానికి ఏం వంక దొరుకుతుందా అని చూస్తారు. కానీ ఓ కొండ ముచ్చు మాత్రం రోజూ స్కూలుకి వెళ్లి పిల్లలతో కలిసి ఎంచక్కా పాఠాలు నేర్చుకుంటుంది.

రోజూ పొద్దున్నే లేచి స్కూలుకు వెళ్లాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. స్కూలు ఎగ్గొట్టడానికి ఏం వంక దొరుకుతుందా అని చూస్తారు. కానీ ఓ కొండ ముచ్చు మాత్రం రోజూ స్కూలుకి వెళ్లి పిల్లలతో కలిసి ఎంచక్కా పాఠాలు నేర్చుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తల్లులు ఆ కొండముచ్చును చూసి నేర్చుకోండి అంటూ తమ పిల్లలకు క్లాసులు తీసుకుంటున్నారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా దనువా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజూ విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరవుతున్న కొండముచ్చును చూసిఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశ్చర్యపోయారు. క్లాస్ రూమ్ నుంచి స్కూల్ ఆఫీస్ వరకు లంగూర్‌ ఉన్న వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది ఎవరికీ ఎలాంటి హానీ, చేయలేదు. ఒక వారం నుండి ఇతర విద్యార్థులతో కలిసి శాంతియుతంగా తరగతులకు హాజరవుతోంది. ఉదయం 9 గంటలకు పాఠశాల తెరిచిన వెంటనే కోతి పాఠశాల ప్రాంగణానికి చేరుకుంటుందని, సాధారణంగా తరగతులు ముగిసిన తర్వాత సాయంత్రం బయలుదేరుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రతన్ వర్మ తెలిపారు. వారం రోజుల క్రితం అకస్మాత్తుగా పాఠశాలలో 9వ తరగతిలోకి ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అయినా ఎవరికీ హాని తలపెట్టకుండా విద్యార్థులతో పాటుగా క్లాసులోని బెంచీపై కూర్చుందని చెప్పారు. అప్పటి నుంచి ఏదో క్లాస్‌ రూమ్‌లో చేరడం, విద్యార్థులతో కలిసి ముందు వరుసలో కూర్చుని, టీచర్లు చెప్పే పాఠాలు, మాటలు కూడా శ్రద్ధగా వింటుందని చెప్పారు. ప్రిన్సిపాల్ లంగూర్‌ని తరిమికొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది క్లాస్‌ రూమ్‌ వదిలి వెళ్లలేదు. దీనిపై అటవీశాఖకు సమాచారం అందించామని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ సకల్‌దేవ్ యాదవ్ తెలిపారు. కానీ, వారు దానిని పట్టుకోలేకపోయారు. అయితే లంగూర్‌ను పట్టుకోవడంలో అధికారులు విఫలమైనప్పటికీ, వారు దానిని పాఠశాల ఆవరణ నుండి తరిమికొట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కండక్టర్‌ను ఉతికారేసిన పాసింజర్‌.. ఎందుకో తెలుసా ??

సివంగితో మామూలుగా ఉండదు మరి.. అడవికి రాజైనా తోక ముడవాల్సిందే..

గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న కుక్క.. సాయం చేసిన పిల్లి..

రైల్లో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణికుడు !!

Follow us on