PM Modi: మోదీ ప్రమాణస్వీకారంలో ట్రాన్స్‌జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు..

|

Jun 08, 2024 | 7:22 PM

మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం జూన్‌ 9 సాయంత్రం రాష్ట్రపతిభవన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే ఆదివారం నాటి చారిత్రక ఘట్టానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం జూన్‌ 9 సాయంత్రం రాష్ట్రపతిభవన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే ఆదివారం నాటి చారిత్రక ఘట్టానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక నేపాల్‌ ప్రధాని పుష్ప కమాల్‌ దహాల్‌ ప్రఛండ, భూటాన్‌, మారిషస్‌ ప్రధానులకు ఆహ్వానం అందింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలతో పాటు మరికొందరు విశిష్ట అతిథులు కూడా ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. శానిటేషన్‌ సిబ్బంది, ట్రాన్స్‌ జెండర్లు, సెంట్రల్‌ విస్టా నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువనున్నారు. అదే విధంగా వికసిత్‌ భారత్‌ అంబాసిడర్లను, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందినవారిని, వందేభారత్‌, మెట్రో రైళ్లలో పనిచేసే సిబ్బందిని ఆహ్వానించారు మోదీ. మొత్తానికి ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరుగనున్న ఈ కార్యమంలో సుమారు 8 వేల మంది పాల్గొంటారు. జూన్‌ 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నేతృత్వంలోని భాగస్వామ్యపక్షాలన్నీ కలిసి 293 స్థానాల్లో గెలుపొందారు. దీంతో మరోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.