MLA Slaps Engineer: నడిరోడ్డులో ఇంజనీర్ల చెంపలు వాయించిన ఎమ్మెల్యే..! అక్రమ కట్టడాలు తొలగించారనా..?
మహారాష్ట్రలో అధికారుల తీరుపై ఓ మహిళా ఎమ్మెల్యే కోపం కట్టలు తెంచుకుంది. నడి బజార్లో నిలబెట్టి చెంపలు వాయించేసింది. ఈ ఘటన థానే జిల్లాలోని మీరా భయందర్ చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ఇద్దరు ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
మహారాష్ట్రలో అధికారుల తీరుపై ఓ మహిళా ఎమ్మెల్యే కోపం కట్టలు తెంచుకుంది. నడి బజార్లో నిలబెట్టి చెంపలు వాయించేసింది. ఈ ఘటన థానే జిల్లాలోని మీరా భయందర్ చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ఇద్దరు ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ మహిళా ఎమ్మెల్యే సివిల్ ఇంజినీర్‌పై చేయి చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా కొన్ని నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. ఇదే ఎమ్మెల్యేకు ఆగ్రహం తెప్పించింది. వర్షాకాలం ముందు చిన్నారులతో పాటు వారి కుటుంబాలు రోడ్డున పడ్డారంటూ ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నిర్మాణాలను ఎలా ధ్వంసం చేస్తారంటూ అధికారులను నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ సివిల్ ఇంజినీర్‌పై ఆమె చేయిచేసుకొని దూషించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతా జైన్ గతంలో బీజేపీ నుంచి మేయర్‌గా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యే విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..