Miraculous Rescue: టర్కీలో అద్భుతం.. శిథిలాలకింద 128 గంటలు సజీవంగా 2 నెలల పసికందు..
టర్కీ, సిరియాలో ఎటుచూసినా విషాధ ఛాయలే.. దాదాపు ఇరవై ఎనిమిది వేల మరణాలు.. నేలమట్టమైన ఆరు వేల భవనాలు.. ఎటుచూసినా శిథిలాల కుప్పలు..
టర్కీ, సిరియాలో ఎటుచూసినా విషాధ ఛాయలే.. దాదాపు ఇరవై ఎనిమిది వేల మరణాలు.. నేలమట్టమైన ఆరు వేల భవనాలు.. ఎటుచూసినా శిథిలాల కుప్పలు.. ఇంతటి భయానక వాతావరణంలో అద్భుతాలు వెలుగుచూస్తున్నాయి. భూకంపం సంభవించి రోజులు గడుస్తున్నా కొందరు శిథిలాల కింద ప్రాణాలతో ఉండటం అక్కడి వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. హతెయ్ ప్రాంతంలో ఫిబ్రవరి 11న శిథిలాల కిందున్న ఓ 3 నెలల చిన్నారిని సహాయక సిబ్బంది కాపాడారు. భూకంపం సంభవించి 128 గంటల గడుస్తున్నా ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది. సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకుని వస్తుండగా స్థానికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరుస్తూ, ఈలలు వేస్తూ సంబర పడిపోయారు.టర్కీ మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించి ఐదు రోజులు కావస్తున్నా కొందరు శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇటీవలే సహాయక సిబ్బంది రెండు సంవత్సరాల ఓ బాలికను, ఆరు నెలల గర్భవతిని, 70 ఏళ్ల వృద్ధురాలినీ కాపాడారు. టర్కీ, సిరియా భూకంపం.. ప్రపంచంలోనే ఏడో అతి భారీ విపత్తుగా రికార్డుల్లోకి ఎక్కింది. తాజా లెక్కల ప్రకారం..టర్కీలో భూకంపం బారిన పడి 24,657 మంది మరణించగా, సిరియాలో 3,500 మంది అసువులు బాసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..