Heart Touching: తండ్రిని బతికించుకోవడానికి ఓ పసివాడి తపన.. ఆరేళ్ళ వయస్సులో ఎంత కష్టం..
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తండ్రిని బతికించుకోవడానికి ఆరేళ్ల బాలుడు పడిన తపన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మండే ఎండలో..
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తండ్రిని బతికించుకోవడానికి ఆరేళ్ల బాలుడు పడిన తపన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మండే ఎండలో.. నడి రోడ్డుపై తన చిట్టి చేతులతో తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బండి ముందు వైపు తల్లి, తండ్రి పరిస్థితిని గమనిస్తూ ఆ పసివాడికి సాయపడుతుంటే.. ఆ చిన్నారి బండిని తోసుకుంటూ పరుగులు తీస్తున్నాడు. దాదాపు మూడు కిలోమీటర్లు నడిచాక బాలుడు కాళ్లూ, చేతులు నొప్పిపుట్టడంతో బండిని పట్టుకుని రోడ్డుపై కూర్చుండిపోయాడు. ఆ పసి ప్రాణం పడుతున్న ఆవేదన చూపరులను కలచివేసింది. మధ్యప్రదేశ్ సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించలేని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణ జరపాలని అధికారులు ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

