వేప చెట్టు నుంచి పాలు.. ఆమె మహిమేనట.. తాగితే రోగాలు మాయం ??
మధ్యప్రదేశ్‌లో వింత ఘటనతో జనం బారులు తీరారు. ఓ వేపచేట్టు నుంచి పాల రూపంలో ద్రవం కారుతోంది.వేప చెట్టు నుంచి పాల పొంగు.. అమ్మవారి మహిమేనంటూ జనం ఉప్పొంగిపోతున్నారు.
మధ్యప్రదేశ్‌లో వింత ఘటనతో జనం బారులు తీరారు. ఓ వేపచేట్టు నుంచి పాల రూపంలో ద్రవం కారుతోంది.వేప చెట్టు నుంచి పాల పొంగు.. అమ్మవారి మహిమేనంటూ జనం ఉప్పొంగిపోతున్నారు. భక్తిభావంతో పూజలు చేస్తున్నారు. సింగ్రౌలీ జిల్లా నిగాహిలో చోటుచేసుకుందీ ఆశ్చర్యకర ఘటన. ఈ క్రమంలో వందలాది మంది భక్తులు వేపచెట్టు దగ్గర గుమిగూడారు. చాలా మంది భక్తులు చెట్టు నుంచి కారే పాలను పాత్రలో నింపి ఇంటికి తీసుకెళుతున్నారు. ఈ పాలను తాగితే అనేక రోగాలు నయమవుతాయని అంటున్నారు. ఈ వేప చెట్టును చాలా సంవత్సరాలుగా పూజిస్తున్నామని, గతంలో కూడా ఈ చెట్టు కింద ఎన్నో అద్భుతాలు జరిగాయని స్థానికులు తెలిపారు.వేప చెట్టుకి చాలా సంవత్సరాలుగా పూజలు చేస్తున్నారు. ఈ ద్రవం కారడంతో కాలినడకన వెళ్లి కొబ్బరికాయ, పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గతంలో కూడా ఈ చెట్టు కింద ఎన్నో అద్భుతాలు జరిగాయంటున్నారు స్థానికులు. వేప చెట్టు నుంచి బయటకు వస్తున్న ద్రవం భూమిపై పెద్ద మొత్తంలో పేరుకుపోతుంది. అయితే, వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమంటున్నారు వృక్ష శాస్త్ర నిపుణులు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై పగుళ్లతో పాటు పాల లాంటి ద్రవం వస్తుందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో !! ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు !!
గోడ కూలుస్తుండగా ఊహించని ఘటన !! అక్కడి సీన్ చూసి కళ్లు జిగేల్ !!
వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడు ఏం చేశాడో చూడండి !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

