జిరాఫీ పిల్లపై సింహం దాడి !! తల్లి ఎలాకాపాడుకుందో చూడండి
సింహం వేటకు దిగిందంటే ఎంతటి జంతువైనా దానిబారి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆ రోజుతో దాని ఆయువు ముగిసినట్లే. కానీ అంతటి రారాజుకి కూడా ఒక్కోసారి ఓటమి తప్పదు.
సింహం వేటకు దిగిందంటే ఎంతటి జంతువైనా దానిబారి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆ రోజుతో దాని ఆయువు ముగిసినట్లే. కానీ అంతటి రారాజుకి కూడా ఒక్కోసారి ఓటమి తప్పదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఓ జిరాఫీ పిల్లను వేటాడబోయిన సింహానికి తల్లి జిరాఫీ చుక్కలు చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక జిరాఫీ పిల్లపై సింహం దాడి చేసి వేటాడబోయింది. పిల్ల కేకలను ఎక్కడినుంచో విన్న తల్లి జిరాఫీ పరుగెత్తుకుంటూ వచ్చింది. వీరావేశంలో పరుగెత్తుకొచ్చిన తల్లి జిరాఫీని చూసి సింహం ఒకింత భయపడింది. వెంటనే పిల్ల జిరాఫీని వదిలి పారిపోయింది. సాధారణంగా పొడవైన మెడ కలిగి ఉండే పెద్ద జిరాఫీని సింహం ఒంటరిగా వేటాడలేదు. అయితే సింహాల గుంపు మాత్రమే పెద్ద జిరాఫీలను వేటాడతాయి. అందుకే ఒంటరి సింహాలు చిన్న జిరాఫీలను లక్ష్యంగా చేసుకుంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. తల్లి జిరాఫీ తెగువకు ముగ్దులవుతున్నారు. తమదైనశైలిలో కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

