Matrimony: విమానాశ్రయంలో పెళ్లి సంబంధాల దుకాణం.. షాప్‌ను చూసి అవాక్కవుతున్న ప్రజలు.
విమానాశ్రయాల్లో ఎన్నో రకాల షాప్ లు కనిపిస్తుంటాయి. ఆదాయం పెంచుకునే మార్గాల్లో ఇదీ ఒకటి. తాజాగా చెన్నై విమానాశ్రయంలో పెళ్లి సంబంధాలు వెతికి పెట్టే దుకాణం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని చూసి ప్రయాణికులు అవాక్కవుతున్నారు. చెన్నై విమానాశ్రయంలో పెళ్లి సంబంధాలు వెతికి పెట్టే ఎలైట్ మ్యాట్రిమోనీ దుకాణాన్ని చూసిన ఓ ప్యాసింజర్ ఆ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
విమానాశ్రయాల్లో ఎన్నో రకాల షాప్ లు కనిపిస్తుంటాయి. ఆదాయం పెంచుకునే మార్గాల్లో ఇదీ ఒకటి. తాజాగా చెన్నై విమానాశ్రయంలో పెళ్లి సంబంధాలు వెతికి పెట్టే దుకాణం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని చూసి ప్రయాణికులు అవాక్కవుతున్నారు. చెన్నై విమానాశ్రయంలో పెళ్లి సంబంధాలు వెతికి పెట్టే ఎలైట్ మ్యాట్రిమోనీ దుకాణాన్ని చూసిన ఓ ప్యాసింజర్ ఆ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎయిర్ పోర్ట్ లో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కనీసం ఫార్మసీ స్టోర్, కన్వీనియన్స్ స్టోర్ కూడా లేదు. కానీ, నాకు ఏం కనిపించిందో మీరూ చూడండి అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు. తన పోస్ట్ ద్వారా అత్యవసర సేవలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. నిత్యం వేలాది మంది వచ్చిపోయే చోట ముఖ్యమైన వాటికి చోటు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు వెంట లగేజీ బ్యాగులు తెచ్చుకునేటప్పుడు, ఎయిర్ పోర్ట్ లో అన్ని లగేజీ షాప్ లు ఎందుకో నాకు అర్థం కావడం లేదని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు. మ్యాట్రిమోనియల్ వాటి కంటే లగేజీ షాపులు మరీ దారుణం అని మరో యూజర్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..