ప‌ట్టప‌గ‌లు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ

ప‌ట్టప‌గ‌లు బ్యాంక్ దోపిడీ.. రూ.5.56 కోట్లు లూటీ

Phani CH

|

Updated on: Sep 21, 2023 | 8:32 PM

ప‌ట్టప‌గ‌లు అంతా చూస్తుండ‌గానే దొంగ‌లు బ్యాంకును లూటీ చేశారు. సాయుధ‌లైన అగంత‌కులు మాస్కులు ధ‌రించి బ్యాంకులోకి చొరబడ్డారు. సిబ్బందిని ఆయుధాల‌తో బెదిరించి ఐదున్నర కోట్ల విలువైన న‌గ‌దు, బంగారంతో ఉడాయించారు. అడ్డుకోబోయిన బ్యాంకు సిబ్బందిలో ఒక‌రిని తీవ్రంగా గాయ‌ ప‌రిచారు. ఈ దోపిడీ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయిగ‌ఢ్ జిల్లా యాక్సిస్ బ్యాంకులో చోటుచేసుకుంది. దోపిడీ దొంగ‌ల చోరీ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయ్యాయి.

ప‌ట్టప‌గ‌లు అంతా చూస్తుండ‌గానే దొంగ‌లు బ్యాంకును లూటీ చేశారు. సాయుధ‌లైన అగంత‌కులు మాస్కులు ధ‌రించి బ్యాంకులోకి చొరబడ్డారు. సిబ్బందిని ఆయుధాల‌తో బెదిరించి ఐదున్నర కోట్ల విలువైన న‌గ‌దు, బంగారంతో ఉడాయించారు. అడ్డుకోబోయిన బ్యాంకు సిబ్బందిలో ఒక‌రిని తీవ్రంగా గాయ‌ ప‌రిచారు. ఈ దోపిడీ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయిగ‌ఢ్ జిల్లా యాక్సిస్ బ్యాంకులో చోటుచేసుకుంది. దోపిడీ దొంగ‌ల చోరీ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయ్యాయి. ధిమ్రాపూర్‌లోని యాక్సిస్ బ్యాంకు డోర్లను తెరువ‌గానే సాయుధులైన ముసుగులు ధ‌రించిన‌ దుండ‌గులు బ్యాంకులలోకి ప్రవేశించారు. తుపాకులు చూపి సిబ్బందిని బెదిరించారు. దొంగలు బ్యాంకు ఉద్యోగుల్లో ఒకరిని తీవ్రంగా గాయ‌ప‌ర్చారు. సిబ్బందిలో భయాందోళనలు సృష్టించారు. 4 కోట్ల19లక్షల రూపాయల నగదు, కోటి 40 లక్షల రూపాయల విలువైన నగలను దుండగులు దోచుకున్న డబ్బుతో పరారయ్యారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దొంగ‌ల‌ అన్ని కార్యకలాపాలు బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రాథమికంగా ఏడుగురు దొంగ‌లు దోపిడీలో పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు కలిగిన పురుషుడిగా రికార్డ్‌ !!

గుండె ఆగిపోతున్నా.. 40 మంది పిల్లల ప్రాణాలను కాపాడిన డ్రైవర్

మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. ఆ తర్వాత..

కెనడాలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. భారతీయులను టార్గెట్‌ చేసే అవకాశం

విమాన టాయిలెట్‌లో సీక్రెట్ ఫోన్ కెమెరా !! మైనర్ బాలికకు చేధు అనుభవం