చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం

Updated on: Jan 12, 2026 | 5:27 PM

ఒంగోలు మార్కాపురంలోని శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ధనుర్మాసం శుభవేళ, స్వామివారి లింగరూపాన్ని సూర్యభగవానుడు తన కిరణాలతో స్పృశించాడు. అరసవిల్లి సూర్యనారాయణమూర్తి ఆలయంలో జరిగే అరుదైన దృశ్యం మాదిరిగా, చంద్రవంక ఆకారంలో వెలుగులు విరజిమ్ముతూ భక్తులకు నయనానందం కలిగించింది. ఇది శివకేశవుల ఐక్యతకు ప్రతీకగా భక్తులు భావించారు.

సాధారణంగా గర్భగుడిలోని దేవతా విగ్రహాలను ఓ ప్రత్యేక సందర్భంలో సూర్యకిరణాలు తాకడం మనం చూస్తుంటాం. నిజానికి గర్భగుడిలోకి సూర్యకిరణాలు ప్రసరించడం అనేది చాలా అరుదు. అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ప్రతి ఏటా మార్చి, అక్టోబరు నెలల్లో స్వామివారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకుతాయి. తాజాగా అలాంటి అరుదైన దృశ్యం ఒంగోలు మార్కాపురంలో చోటుచేసుకుంది. మార్కాపురం మార్కెట్ యార్డు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వరస్వామివారి దేవస్థానంలో ఈ అరుదైన ఘటన జరిగింది. గర్భాలయంలో ఉన్న లయకారుడు, బోళాశంకరుడు, మహదేవుడు, భక్తుల పాలిట కొంగుబంగారమైన చంద్రమౌళీశ్వరస్వామిగా పూజలందుకుంటున్న పరమేశ్వరుని లింగరూపాన్ని ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు తన లేలేత కిరణాలతో స్పృశించాడు. ధనుర్మాసం శుభవేళ శివకేశవులు ఒక్కటేనని భావిస్తున్న భక్తులకు సూర్యనారాయణుడు పరమశివుడిని స్పృశించాడు. చంద్రమౌళీశ్వరునిపై సూర్యకిరణాలు చంద్రవంక ఆకారంలో వెలుగులు విరజిమ్ముతూ భక్తులకు నయనానందం కలిగించాయి. ఈ అరుదైన దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్‌ చూసి పరుగులు

వరి పొలం బురదలో దిగి.. నాట్లు వేసిన డిప్యూటీ కలెక్టర్ హరిణి

Yadadri: యాదాద్రిలో గుప్త నిధుల కలకలం

456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??

రిపబ్లిక్‌ డే పరేడ్‌.. పక్షుల కోసం ఇలా