రూ.10 కోసం ఇంత దిగజారాలా ?? నడిరోడ్డుపై స్నానం.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకులను పెంచుకునేందుకు ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. తమిళనాడులో ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు భలే షాకిచ్చారు. చెన్నైలోలోని చెన్నిమలై సమీపంలోని వెల్లోట్‌కు చెందిన పార్థిబన్
వైరల్ .. వైరల్.. వైరల్.. కొంతమందిని ఈ పిచ్చి వదలట్లేదు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకులను పెంచుకునేందుకు ఎలాంటి పనులు చేయడానికైనా వెనుకాడట్లేదు. తమిళనాడులో ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు భలే షాకిచ్చారు. చెన్నైలోలోని చెన్నిమలై సమీపంలోని వెల్లోట్‌కు చెందిన పార్థిబన్ అనే 26 ఏళ్ల యువకుడు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో 10 రూపాయల ఛాలెంజ్‌ని స్వీకరించాడట. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్కూటీపై కూర్చుని పార్థిబన్ తన ఒంటిపై ఓ బకెట్ నీళ్లు కుమ్మరించుకున్నాడు. అతని స్నేహితులు ఈ తతంగాన్ని వీడియో తీశారు. సిగ్నల్ పడిపోయినా అతను ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. నిత్యం జనసంచారంతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పార్థిబన్ చేసిన ఫీట్ జనాలకు చిర్కెత్తుకొచ్చింది. ఇక ఈ విషయమంతా పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడికి ఏకంగా 3500 రూపాయల జరిమానా విధించారు. ఇకపై ఇలాంటివి చెయ్యొద్దని అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

