వేల అడుగుల ఎత్తులో హెలికాఫ్టర్‌ నుంచి దూకేసిన వ్యక్తి !! తలక్రిందులుగా గిరగిరా తిరుగుతూ !!

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:22 PM

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం అనేకమంది రకరకాల సాహసాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రాణాలకు తెగించి స్టంట్స్‌ చేస్తుంటారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం అనేకమంది రకరకాల సాహసాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రాణాలకు తెగించి స్టంట్స్‌ చేస్తుంటారు. అలాంటి వీడియోలు ఇటీవల ఇంటర్నెట్‌లో చాలానే దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం ఎలాంటి సాహసం చేసాడో చూస్తే షాకవుతారు.. అమెరికాకు చెందిన కీత్ కెబె ఎడ్వర్డ్ స్నైడర్ స్కై సర్ఫింగ్ చేస్తుంటాడు. అంటే వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి దూకి నేల మీదకు సర్ఫింగ్ చేస్తున్నట్టుగా రావడమన్నమాట. ఈ క్రమంలోనే తాజాగా తన కాళ్లకు సర్ఫింగ్ బోటును కట్టుకుని.. తలకిందులుగా హెలికాప్టర్ స్పిన్స్ చేశాడు. ఈ ఏడాది జూలై నెలలో వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి ఒకే దఫాలో ఏకంగా 175 రివర్స్ స్పిన్స్ చేశాడు. ఇతను 2021లో కూడా ఈజిప్ట్‌లోని గిజాలో పిరమిడ్ల సమీపంలో ఇలాంటి ప్రయత్నమే చేశాడు. అయితే అప్పట్లో 165 రౌండ్లు మాత్రమే తిరిగాడు. తాజాగా ఆ రికార్డును అధిగమించాడు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ ఫీట్ ను హెలికాప్టర్ లోంచి పరిశీలించడంతోపాటు వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోను గిన్నిస్ బుక్ తాజాగా తమ యూట్యూబ్ చానల్ లో పోస్ట్‌ చేసింది. దాంతో అది వైరల్‌గా మారింది. యువకుడి సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్డులో నుంచి రాగానే పడగ విప్పుతూ బుసలు కొడుతోన్న బేబీ కోబ్రా !! వీడియో చూస్తే జలదరించాల్సిందే

Vikram: ఒక్క విక్రమ్‌ వల్ల..1788 పైరసీ సైట్లు మటాష్‌

Cobra: రిలీజ్ కాకముందే.. RRRను దాటేసిన కోబ్రా..

Vikram: గెటప్స్‌కు ఏకంగా అన్ని కోట్లా.. నోరళ్ల బెట్టిస్తున్న విక్రమ్‌ రెమ్యూనరేషన్

ఈ రేంజ్‌లో బర్త్‌డే విషెస్‌ ఆ..RGV ట్వీట్ మామూలుగా లేదుగా

Published on: Aug 31, 2022 08:15 AM