15 గంటలు.. 286 మెట్రో స్టేషన్లు..వెరసి గిన్నిస్‌ రికార్డ్‌.. కానీ..

|

Jul 01, 2023 | 8:48 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు అరుదైన గిన్నిస్ రికార్డు సాధించాడు. అయితే అతనికి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ మాత్రం దాదాపు రెండేళ్ల తర్వాత వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన శశాంక్‌ మను ఫ్రీలాన్స్‌ రీసెర్చర్‌గా పని చేస్తున్నాడు. అతనికి మెట్రో ట్రైన్ లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం.

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు అరుదైన గిన్నిస్ రికార్డు సాధించాడు. అయితే అతనికి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ మాత్రం దాదాపు రెండేళ్ల తర్వాత వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన శశాంక్‌ మను ఫ్రీలాన్స్‌ రీసెర్చర్‌గా పని చేస్తున్నాడు. అతనికి మెట్రో ట్రైన్ లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. దాంతో ఢిల్లీలో ఉన్న అన్ని మెట్రో స్టేషన్ లను చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. కేవలం 15 గంటల్లో 286 మెట్రో స్టేషన్లను చుట్టేశాడు. 2021 ఏప్రిల్‌ 14న తన ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని మెట్రో బ్లూ లైన్‌ నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభించి, రాత్రి ఎనిమిదిన్నర గంటలకు గ్రీన్‌లైన్‌లోని బ్రిగేడియర్ హోషియర్ సింగ్ స్టేషన్‌లో ముగించాడు. ఇందుకు గాను అతడు టూరిస్ట్ కార్డ్‌ని ఉపయోగించాడు. అయితే రెండేళ్ల కిందటే శశాంక్‌ మను ఈ ఘనత సాధించినప్పటికీ చిన్న పొరపాటు వల్ల గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ నుంచి ఆలస్యంగా గుర్తింపు వచ్చింది. ఈ అవార్డును తొలుత మెట్రో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ ప్రఫుల్‌ సింగ్‌కు ఇచ్చారు. అతడు 2021 ఆగస్టు 29న 16 గంటల 2 నిమిషాలలో ఢిల్లీ మెట్రో స్టేషన్లన్నింటినీ చుట్టొచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేకలలో కింగ్‌.. బరువులోనూ ధరలోనూ కూడా.. ధర తెలిస్తే షాక్

గిన్నిస్‌ బుక్‌ ఎక్కాలనుకున్నాడు.. టైటానిక్‌ సాక్షిగా మునిగిపోయాడు !!

Digital TOP 9 NEWS: మోదీకి కేటీఆర్ ప్రశ్నాస్త్రం | మిన్నంటిన టమోటా రేటు

Mega Princess: బంగారు ఉయ్యాలలో.. రాజసంగా మెగా ప్రిన్సెస్..

TOP 9 ET News: బిగ్ ఫైట్ | వెరైటీగా పేరు పెట్టారు

 

Follow us on