అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుభేల్

|

Oct 01, 2024 | 9:47 PM

తెలతెలవారుతోంది. గ్రామస్తులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. బయటకు వెళ్లేవారు వాహనాలపై వెళ్తున్నారు. మసక చీకటి.. పెద్దగా జనసంచారం కూడా లేదు. ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాలు అప్పుడొకటి అప్పడొకటిగా వెళ్తున్నాయి. అలా వెళ్తున్న వాహనదారులకు మసకచీకటిలో నడిరోడ్డుపై వింత ఆకారం కనిపించింది. భయపడుతూనే దగ్గరగా వెళ్లి పరిశీలించిన వారి గుండెజారినంతపనైంది.

తెలతెలవారుతోంది. గ్రామస్తులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. బయటకు వెళ్లేవారు వాహనాలపై వెళ్తున్నారు. మసక చీకటి.. పెద్దగా జనసంచారం కూడా లేదు. ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాలు అప్పుడొకటి అప్పడొకటిగా వెళ్తున్నాయి. అలా వెళ్తున్న వాహనదారులకు మసకచీకటిలో నడిరోడ్డుపై వింత ఆకారం కనిపించింది. భయపడుతూనే దగ్గరగా వెళ్లి పరిశీలించిన వారి గుండెజారినంతపనైంది. రెండడుగుల గంభీరమైన నల్లటి ఆకారంలో ఉన్న బొమ్మ.. చుట్టూ పసుపు కుంకుమలు, బొగ్గు, నిమ్మకాయలు, పూలు ఇతర పదార్ధాలతో భయానకంగా ఉంది ఆ దశ్యం. ఆ వాతావరణాన్ని బట్టి చూస్తే అక్కడ క్షుద్ర పూజలు భారీ ఎత్తున నిర్వహించినట్టు తెలుస్తోంది. అది చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. లేపాక్షి మండలం పులమతి ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. నడిరోడ్డులో మట్టితో రెండు అడుగుల భయానక విగ్రహాన్ని పెట్టి…. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, రక్తంతో క్షుద్ర పూజలు చేశారు. అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయడంతో… ఉదయం అటుగా వెళ్లిన వాహనదారులు వాటిని చూసి భయాందోళనకు గురయ్యారు. గుప్తనిధుల కోసమా?? లేదా ఎవరిపైనైనా చేతబడి చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢిల్లీ విమానాశ్రయంలో 2027 నాటికి ఎయిర్‌ ట్రైన్.. ప్రత్యేకతలివే

పని ఒత్తిడికి బ్యాంక్‌ ఉద్యోగిని బలి.. డ్యూటీలోనే కుప్పకూలి మృతి

విమాన ప్రయాణాలపై ఎపెక్ట్ ?? తప్పదంటున్న శాస్తవేత్తలు

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

కోనసీమ కొబ్బరికి మహర్దశ.. ఒక్క నెలలో ధర ఎంత పెరిగిందంటే ??