వేదికపై అందరూ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి. మరి కన్ను హోరి మాలే పాటకు వారు డ్యాన్స్ చేస్తుండగా.. వారిలో ఒకరు కుప్పకూలిపోయారు. ఏమి జరిగిందో చూసే సమయానికి, కుప్పకూలిపోయిన వ్యక్తి ఊపిరి ఆగిపోయింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా లింగ్సూర్ తాలూకాలోని సర్జాపూర్‌కు చెందిన బసవరాజ్ ఎన్నువట రిసార్ట్‌లో డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలిపోయి మరణించాడు. బసవరాజ్ ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.