Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్‌ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్‌..

Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్‌ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్‌..

Phani CH

|

Updated on: Sep 16, 2023 | 9:58 AM

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 12 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్, స్పెయిన్‌కు వెళ్లారు. ప్రస్తుతం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో​ పర్యటిస్తున్నారు. తాజాగా అక్క‌డ ఆమె జాగింగ్ చేస్తూ క‌నిపించారు. చీర క‌ట్టులో.. స్మార్ట్‌ వాచ్‌ ధరించి, రబ్బరు చెప్పులు వేసుకుని మ‌రీ.. మాడ్రిడ్ పార్క్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ జాగింగ్ చేశారు. దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 12 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్, స్పెయిన్‌కు వెళ్లారు. ప్రస్తుతం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో​ పర్యటిస్తున్నారు. తాజాగా అక్క‌డ ఆమె జాగింగ్ చేస్తూ క‌నిపించారు. చీర క‌ట్టులో.. స్మార్ట్‌ వాచ్‌ ధరించి, రబ్బరు చెప్పులు వేసుకుని మ‌రీ.. మాడ్రిడ్ పార్క్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ జాగింగ్ చేశారు. దీదీతో పాటు ఆ దేశానికి వెళ్లిన బృందం కూడా జాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘మార్నింగ్‌ రిఫ్రెష్. ఉద‌య‌మే జాగింగ్ చేస్తే రోజుకు కావాల్సిన శ‌క్తి వ‌స్తుంది. అందరూ ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండండి’ అంటూ ఆమె ఆ పోస్టుకు కామెంట్ కూడా చేశారు. సాధార‌ణంగా ప్ర‌తి రోజూ ట్రెడ్‌మిల్‌పై జాగ్ చేస్తుంటారు. గతంలోనూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ వివిధ సందర్భాల్లో చెప్పుకొస్తూ ఉంటారు. స్పెయిన్‌లో వాయిద్య పరికరం అకార్డియన్‌ను వాయించి సంగీతాన్ని పలికించారు. సంగీతం నిరంతర ప్రవాహం. ఎవరి వ్యక్తిత్వానికి తగ్గట్లు వారి సంగీతం పరిణతి చెందుతుంది అంటూ వీడియోకు కాప్షన్‌ పెట్టారు. ఓసారి ఆమె డార్జిలింగ్‌ కొండల్లో 10 కిలోమీటర్లు జాగింగ్‌ చేసి ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 12 రోజుల పాటు దుబాయ్‌, స్పెయిన్‌ పర్యటనకు వెళ్లిన దీదీ ప్రముఖ స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ అయిన లా లిగా అధ్యక్షుడితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. లా లిగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్‌లలో ఒకటి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??

DSP: మ్యూజిక్‌ లవర్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ స్సెషల్ గిఫ్ట్

Pallavi Prashanth: సూసైడ్ అటెంప్ట్‌.. ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటూ.. ప్రశాంత్‌ పేరెంట్స్ ఎమోషనల్

Bigg Boss 7 Telugu: బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ దగ్గర్లో రైతు బిడ్డ

Navadeep: అరెస్ట్ నుంచి కొద్దిలో తప్పించుకున్న నవదీప్‌