cooking oil – pork fat: పంది కొవ్వుతో గుట్టుగా వంట నూనె తయారీ.. ఫ్రైడ్ రైస్ దుకాణాలకు విక్రయం..
పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని మాల్కాజగిరి పోలీసులు బుధవారం జూన్ 28న అరెస్ట్ చేశారు. మల్కాజగిరి ఇన్‌స్పెక్టర్ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో రమేశ్ శివ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని మాల్కాజగిరి పోలీసులు బుధవారం జూన్ 28న అరెస్ట్ చేశారు. మల్కాజగిరి ఇన్‌స్పెక్టర్ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో రమేశ్ శివ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా రమేశ్ తన నివాసంలోనే గత కొన్నేళ్లుగా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు సేకరించి, అనంతరం దాన్ని మరిగించి పలు రకాల రసాయనాలు కలిపితే అచ్చం వంట నూనెలా కనిపించే నూనెలు తయారు చేస్తున్నాడు. ఇలా తయారు చేసిన నూనెను రోడ్డు పక్కన ఉండే ఫ్రైడ్ రైస్ దుకాణాల నిర్వాహకులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రమేశ్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దీంతో గుట్టుగా పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్న నిందితుడి బండారం బట్టబయలైంది. నిందితుడిని అరెస్టు చేసి నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి నూనెలు కొనుగోలు చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ దుకాణదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

