Superstition: ఇది విశ్వాసమా.. మూఢత్వమా..మంటల్లో జనం పరుగులు.. ప్రాణాలతో చెలగాటమా..
ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని మందసౌర్ జిల్లాలోని నల్చా మాత ఆలయ ప్రాంతం నుండి చుల్ నిర్వహిస్తారు. నిప్పుల మీద నడవటం వల్ల మనసులోని కోరికలు తీరుతాయని అక్కడి ప్రజల్లో గట్టి నమ్మకం.
టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢ విశ్వాసాలను వదలడంలేదు. విశ్వాసం పేరుతో వింత ఆచారాలతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 5న విజయదశమి సందర్భంగా మందసౌర్‌లోని నల్చా మాత మందిరానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మండుతున్న మంటల్లోనుంచి పరుగులు తీస్తూ తమ భక్తిని చాటుకున్నారు. అయితే ఈ చర్యను కొందరు తప్పుబట్టారు. మూఢ విశ్వాసంతో ప్రజలు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని మందసౌర్ జిల్లాలోని నల్చా మాత ఆలయ ప్రాంతం నుండి చుల్ నిర్వహిస్తారు. నిప్పుల మీద నడవటం వల్ల మనసులోని కోరికలు తీరుతాయని అక్కడి ప్రజల్లో గట్టి నమ్మకం. ఆలయ పరిధిలోని ఒక గొయ్యిలో కట్టెలు వేసి గొయ్యికి నిప్పంటించారు. కొంత సేపటి తర్వాత అందులో నెయ్యి వేసారు. దాంతో అక్కడ మంటలు ఎగసిపడ్డాయి. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఈ నిప్పులపై నడిచారు. అలా మంటల్లో నడిస్తే..ఆ దేవత తన కోరికలను తీరుస్తుందని స్థానికులు నమ్ముతారు. అయితే ప్రమాదకరమైన అగ్ని గుండాల దాటుతున్నప్పుడు..కొందరు తడబడతారు. అయినా వారిని ఆపేందుకు ఎవరూ సాహసించరు. అధికారులు,పరిపాలన యంత్రాంగం సైతం ఈ దృశ్యాన్ని చూస్తూ ప్రేక్షకపాత్ర వహించాల్సిందే. కాగా ఇక్కడ అగ్నిమాపక బృందం కూడా కనిపించదు, ఎలాంటి భద్రతా చర్యలు ఉండవు. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం ప్రజలకు అండగా నిలుస్తుందని గ్రామస్తులు అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
