గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయారు

|

Dec 30, 2024 | 8:06 PM

ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా..గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. వెళ్లాల్సిన రూట్‌ తెలియకపోయినా.. గూగుల్ మ్యాప్‌ ఉందిగా.. ఇంకెందుకు చింత అంటూ గుడ్డిగా గూగుల్‌ మ్యాప్‌ను అనుసరిస్తున్నారు. అయితే ఇది ఖచ్చితమైన అడ్రస్ తో పాటు సేఫ్‌ రూట్ లో తీసుకువెళుతుందా అంటే కొన్ని సందర్భాల్లో రాంగ్ రూట్, రాంగ్‌ అడ్రస్ కి తీసుకు వెళుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

వెళ్ళాల్సి న రూట్ కాకుండా ఎటో తీసుకుపోతుది. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే భద్రాచలంలో చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షత్రమైన భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులను గూగుల్ మ్యాప్ ముప్పు తిప్పలు పెట్టింది. భద్రాద్రి రామయ్యకు మొక్కులు తీర్చేందుకు విజయనగరం నుండి బస్సులో బయలు దేరారు కొందరు భక్తులు. వీరు గూగుల్‌ మ్యాప్‌ ను అనుసరిస్తూ ప్రయాణించారు. ఆ డ్రైవర్‌ గూగుల్‌ మ్యాప్ లో చూపిన విధంగా బస్సు నడుపుతున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ.. ఓ చిన్న వీధిలో బస్సు ఇరుక్కుపోయింది. ఆ బస్సు పెద్దగా ఉండటంతో టర్న్‌ చేయడానికి నానా తంటాలుపడ్డాడు డ్రైవర్‌. ఎంతకీ బస్సు కదలకపోవడంతో భక్తులు విసిగిపోయిన బస్సు దిగిపోయి స్థానిక ఇళ్ల అరుగులపైన కూర్చుని రామా.. కనవేమిరా.. అంటూ రామభద్రుడికి తమ గోడును వినిపించుకున్నారు. చివరకు స్థానికుల సహాయంతో ఆ చిన్న సందులో నుంచి బస్సును జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం భక్తులంతా ఈ గూగుల్‌ మ్యాప్‌కో దండం అంటూ.. బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..

కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే

నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త !!