Loco pilot: నది వంతెనపై ఆగిన రైలు.. ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్.. వైరల్ అవుతున్న వీడియో..
రైలు ప్రయాణికుడు చైన్ లాగిన సందర్భం ఓ లోకోపైలట్ ప్రాణం మీదికొచ్చింది. మహారాష్ట్ర ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. ముంబై నుంచి బీహార్‌లోని ఛాప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని
రైలు ప్రయాణికుడు చైన్ లాగిన సందర్భం ఓ లోకోపైలట్ ప్రాణం మీదికొచ్చింది. మహారాష్ట్ర ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. ముంబై నుంచి బీహార్‌లోని ఛాప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు. దీంతో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఒక నది వంతెనపై ఆ రైలు ఆగింది. చైన్ లాగిన రైలు బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేస్తేనే ఆ రైలు కదులుతుంది. బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ చాలా రిస్క్ తీసుకున్నారు. రైలు ఇంజిన్‌లో ఉన్న ఆయన అతి కష్టం మీద చివరన ఉన్న రైలు బోగికి చేరుకున్నారు. వంతెనపై రైలు ఆగి ఉండటంతో ధైర్యం చేసి రైలు బోగి కిందకు వెళ్లి అక్కడ ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేశారు.
ఘటనపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రైలు చైన్‌ని లాగాలని ట్విట్టర్‌లో సూచించింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..