Loco Pilot: చనిపోయాడనుకున్న లోకోపైలట్ సజీవంగా ఉన్నాడా.? డార్జిలింగ్ రైలు ప్రమాదంలో మలుపు.!

|

Jun 24, 2024 | 2:02 PM

డార్జిలింగ్​లో జరిగిన రైలు ప్రమాదంలో గూడ్సు ట్రైన్ అసిస్టెంట్ లోకో పైలట్​ మను కుమార్ సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మను కుమార్ సిలిగుడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. ప్రమాదం జరిగిన రోజే గూడ్సు ట్రైన్​ లోకో పైలట్​తో పాటు అసిస్టెంట్ కూడా చనిపోయారని రైల్వే బోర్డ్ ప్రకటించింది.

డార్జిలింగ్​లో జరిగిన రైలు ప్రమాదంలో గూడ్సు ట్రైన్ అసిస్టెంట్ లోకో పైలట్​ మను కుమార్ సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మను కుమార్ సిలిగుడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. ప్రమాదం జరిగిన రోజే గూడ్సు ట్రైన్​ లోకో పైలట్​తో పాటు అసిస్టెంట్ కూడా చనిపోయారని రైల్వే బోర్డ్ ప్రకటించింది. వైరల్​ అవుతున్న వీడియోలో అస్టిసెంట్ లోకో పైలట్ మను కుమార్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా కనిపించింది. ఆ సమయంలోనే లోకో పైలట్ ఎలా ఉన్నారని మను అడుగుతున్నట్లు ఉంది. సోమవారం జరిగిన ప్రమాదంలో గాయపడిన మనును తొలుత రైల్వే ఆస్పత్రిలో చేర్చినట్లు, అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. రైల్వే సిగ్నలింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉండటం వల్ల ఉద్యోగులపై అదనపు ఒత్తిడి పడుతుందని మను సహోద్యోగి అన్నట్లుగా సమాచారం. సాధారణంగా రెండు రోజులు నైట్​ డ్యూటీ తర్వాత ఒక రోజు సెలవు ఉంటుంది. కానీ మను వరుసగా మూడు రోజులు నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఒక రోజు సెలవు ఉన్నప్పటికీ మనును సోమవారం డ్యూటీకి రావాలని అడిగారని అతడి సహోద్యోగి అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.