Local Train: పట్టాలు తప్పిన లోకల్‌ ట్రైన్‌.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.

Updated on: Oct 24, 2023 | 8:46 PM

చెన్నైలో ఓ లోకల్ ట్రైన్‌ పట్టాలు తప్పింది. ఆవడి వద్ద ఈఎంయూకి చెందిన తిరువళ్ళూరు రూట్ లోకల్ ట్రైన్ అక్టోబర్‌ 24 ఉదయం పట్టాలు తప్పింది. అన్ననూర్ వర్క్‌షాప్ నుంచి ఆవడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్‌కు సంబంధించిన 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి. మెరీనా బీచ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

చెన్నైలో ఓ లోకల్ ట్రైన్‌ పట్టాలు తప్పింది. ఆవడి వద్ద ఈఎంయూకి చెందిన తిరువళ్ళూరు రూట్ లోకల్ ట్రైన్ అక్టోబర్‌ 24 ఉదయం పట్టాలు తప్పింది. అన్ననూర్ వర్క్‌షాప్ నుంచి ఆవడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్‌కు సంబంధించిన 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి. మెరీనా బీచ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరువళ్లూరు నుంచి సెంట్రల్ రూట్‌లో గత నెల రోజులుగా నిర్వహణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రైలు పట్టాలపై పగుళ్లు కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మరోవైపు లోకో ఫైలెట్ అస్వస్థత గురికావడంతోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..