Viral: విమానంలో గాల్లో ఉండగానే ఇంజిన్ ఆపేందుకు పైలట్ యత్నం.. ఎందుకంటే..?
విమానం గాల్లో ఉండగా ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించిన ఓ ఆఫ్-డ్యూటీ పైలట్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వాషింగ్టన్ డీసీ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కో వెళుతున్న అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానంలో అక్టోబరు 22న ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికి డ్యూటీలో లేని జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ అనే పైలట్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. విమానం కాక్‌పిట్‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న అతడు అకస్మాత్తుగా..
విమానం గాల్లో ఉండగా ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించిన ఓ ఆఫ్-డ్యూటీ పైలట్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వాషింగ్టన్ డీసీ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కో వెళుతున్న అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానంలో అక్టోబరు 22న ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికి డ్యూటీలో లేని జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ అనే పైలట్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. విమానం కాక్‌పిట్‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న అతడు అకస్మాత్తుగా ముందుకు ఉరికి విమానం ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో, విమానం కెప్టెన్, కోపైలట్ అప్రమత్తమై అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం, ఇతర సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరంగా పోర్ట్‌లాండ్‌లో దింపి నిందితుడిని అరెస్టు చేశారు. విమానంలోని మొత్తం 83 ప్రయాణికులపై హత్యయత్నానికి పాల్పడినందుకు నిందితుడిపై కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం, డ్యూటీలో లేని పైలట్లను విమానం కాక్‌పిట్‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణించేందుకు అనుమతిస్తారు. కానీ, విమాన పైలట్ అనుమతిచ్చాకే ఆఫ్ డ్యూటీ పైలట్లను కాక్‌పిట్‌లోకి రానిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..