Viral: అరుదైన లాంతరు !! ఉప్పునీటితో వెలుగుతుంది..

Updated on: May 05, 2022 | 9:59 AM

మీకొక అద్భుత దీపం గురించి చెప్ప బోతున్నాం. ఇది పాతకాలం నాటి లాంతరులా ఉంటుంది. దీనిని వెలిగించడానికి కిరోసిన్‌ కానీ, నూనెకానీ, అవసరం లేదు. అలాగని ఇది కరెంట్‌ దీపమా అంటే అదీ కాదు..

మీకొక అద్భుత దీపం గురించి చెప్ప బోతున్నాం. ఇది పాతకాలం నాటి లాంతరులా ఉంటుంది. దీనిని వెలిగించడానికి కిరోసిన్‌ కానీ, నూనెకానీ, అవసరం లేదు. అలాగని ఇది కరెంట్‌ దీపమా అంటే అదీ కాదు.. దీనికి కరెంట్‌ అవసరం లేదు.. బ్యాటరీ కూడా అవసరం లేదు. ఉప్పునీరు ఉంటే చాలు. నమ్మడం లేదు కదా.. నిజం… దీనిని ‘లైట్‌పల్స్‌ ఎకో లాంతర్‌’ పేరిట ‘గ్యాలప్‌ ఇన్నోటెక్‌’ అనే చైనా కంపెనీ రూపొందించింది. ఇంతకీ ఉప్పునీటితో ఇదెలా వెలుగుతుందనేగా మీ అనుమానం. మామూలు లాంతరులో కిరోసిన్‌ నింపే బదులు, ఇందులో ఉప్పునీరు నింపుకోవాలి. దీని అడుగుభాగంలో అల్యూమినియం ప్లేట్‌ ఉంటుంది. దాంతో జరిపే రసాయనిక చర్య వల్ల పుట్టే విద్యుత్తే దీనికి ఇంధనం. ఈ లాంతరు వెలుతురును కోరుకున్న విధంగా అడ్జస్ట్‌ చేసుకునే వెసులుబాటుకూడా ఉంది. ఇది కేవలం వెలుతురు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు, ఈ లాంతరుకు ఉన్న యూఎస్‌బీ పోర్టు ద్వారా దీపం వెలుగుతూ ఉండగానే.. మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జింగ్‌ చేసుకోవచ్చు కూడా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు !! కిలో 2.70 లక్షలు !! దీని స్పెషాలిటీ ఏమిటంటే ??

Viral: ఆర్డర్‌ పెట్టకుండానే ఇంటికి పార్శిల్‌.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్

Beast OTT: ‘బీస్ట్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??

Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు