చెట్టెక్కి కొట్టుకున్న సింహం-చిరుత.. తర్వాతి సీన్‌ చూస్తే నవ్వాగదు

Updated on: Oct 30, 2025 | 5:15 PM

అడవికి రాజు సింహం. అడవిలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సింహం చాలా యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. అయితే, సింహం ఎక్కువ శాతం నేలపైనే పోరాడుతుంది. కానీ ఈసారి అనుకోకుండా చిరుతపులితో పోరాడాల్సి వచ్చింది. అదీ.. చెట్టుపై ఎక్కి కూర్చొన్న చిరుత మీద. సింహం కంటే తేలికగా, వేగంగా ఉంటుంది గనుక అది టక్కున చెట్టెక్కి కూర్చోగా.. సింహం దానిమీద యుద్ధానికి దిగి నానా తిప్పలు పడింది.

సింహం బరువైన శరీరం కారణంగా చెట్టు ఎక్కడం అరుదు. అయితే, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో సింహం చెట్టు ఎక్కింది. చిరుతపులితో పోరాడి వేటాడే ప్రయత్నంలో అది బలహీనమైన కొమ్మపైకి చేరుకుంటుంది. కానీ దాని ప్రయత్నం బెడిసికొట్టి కిందపడి గాయాలపాలైంది. కొమ్మ విరిగిన క్షణంలో ఆ దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంటుంది. చిరుతలు సాధారణంగా తాము వేటాడి తినగా మిగిలిన ఆహారాన్ని చెట్ల మీద దాచిపెట్టుకుంటాయి. అలాగే ఈ వీడియోలోని చిరుత కూడా ఏదో అక్కడ తెచ్చి దాచుకుంది. కానీ, అది గమనించిన సింహం..అదేంటో చూద్దామని అనుకుంది. ఆపసోపాలు పడి.. మొత్తానికి చెట్టెక్కి.. చిరుతతో భీకరంగా పోరాటం చేసింది. అయితే.. తాను తెచ్చుకున్న ఆహారం జోలికి వచ్చిన సింహాన్ని చిరుత గట్టిగా అడ్డుకునే క్రమంలో అది చెట్టు పైపైకి వెళ్లింది. చిరుత లాగే సింహం ఆ కొమ్మ వద్దకు వెళ్లగానే.. అది ఫట్ మని విరిగిపోయింది. దీంతో, సింహం, చిరుత రెండూ చెట్టు మీద నుంచి కింద పడ్డాయి. అయితే.. అంత ఎత్తునుంచి పడిపోయినా చిరుత చటుక్కున లేచి అక్కడినుంచి వేగంగా పారిపోయింది. కానీ, తన భారీ శరీరం కారణంగా.. అక్కడే నిలబడి ఒంటిమీది గాయాలు చూసుకుంటూ.. ‘అనవసరంగా రిస్క్ చేసానేమో’ అన్నట్లుగా నిలబడిపోయింది. 11 సెకన్ల ఫుటేజ్ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియోను ఒక మిలియన్‌ మందికి పైగా వీక్షించారు. దాదాపు ఆరు వేల మంది లైక్ చేశారు. ప్రతి ఒక్కరూ చెట్టు నుండి పడి లేచి నిలబడే చిరుతపులి సామర్థ్యాన్ని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పెన్షనర్లకూ పండగే

వామ్మో.. క్షుద్ర పూజలకు ఇలాంటి జంతువును బలిస్తారా?

తుఫాను వేళ పాముల బీభత్సం.. వణికిపోతున్న జనం

తెలుగు రాష్ట్రాలకు IMD వార్నింగ్‌.. మరో 2 రోజులు మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్

మొంథా తుఫాన్ బీభత్సం.. ఇళ్లల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం