AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: సింహం సాలిడ్ అటాక్.. కానీ సిల్లీగా చెట్టుపై నుంచి కింద ప‌డింది.. చిరుత కూడా

అడ‌విలో సింహం వేట ఎంత సాలిడ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాని గ‌ర్జ‌న వినిపించినా చాలు మిగ‌తా జంతువులు...

Shocking Video: సింహం సాలిడ్ అటాక్.. కానీ సిల్లీగా చెట్టుపై నుంచి కింద ప‌డింది.. చిరుత కూడా
Lion Attack
Ram Naramaneni
|

Updated on: May 02, 2021 | 9:14 PM

Share

అడ‌విలో సింహం వేట ఎంత సాలిడ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాని గ‌ర్జ‌న వినిపించినా చాలు మిగ‌తా జంతువులు ప‌రుగు లఖించుకుంటాయి. అడ‌వికి రాజు అంటే ఆ మాత్రం భ‌యం ఉండాలిగా మ‌రి. ఇక సింహం పంజా ప‌వ‌ర్ ఎన్నో విడియోలలో చూశాం. పుస్తకాల‌లో చ‌దివాం. తాజాగా సింహం ప‌దునైన వేట‌కు సంబంధించిన ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో తెగ వైర‌ల్ అవుతుంది. చాలా మంది ఈ వీడియోను చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. మ‌రికొంద‌రు ఇంత‌కుముందు ఎప్పుడూ ఇటువంటి సింహం వేట చూడ‌లేద‌ని కామెంట్ చేస్తున్నారు.

ఒక చెట్టుపైన చిటారు కొమ్మ‌న కూర్చున్న చిరుత‌పులి హాయిగా నాన్ వెజ్ ఆర‌గిస్తుంది. దాన్ని గ‌మ‌నించిన సింహం నెమ్మ‌దిగా చెట్టు ఎక్కి ఒక్క‌సారిగా మాంసం కోసం చిరుత‌పై అటాక్ చేసింది. అయితే బ‌రువు అధిక‌మ‌వ్వ‌డంతో చెట్టు కొమ్మ విరిగి సింహం, చిరుత రెండూ కింద‌ప‌డిపోయాయి. కింద‌ప‌డగానే చిరుత అక్క‌డ్నుంచి లేచి వెంట‌నే ల‌గెత్తింది. ఈ వీడియోను సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో తెగ షేర్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Also Read: కొరియ‌ర్ సంస్థ పేరుతో ట్రాకింగ్ మెసేజ్‌.. క్లిక్ చేసే ఖేల్ ఖ‌తం.. ముందే జాగ్ర‌త్త ప‌డండి..

 ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ

Follow Us