Lion and Snake:ఎంత సింహ రాజు అయినా స్నేక్ రాజు ముందు ఇంతే..! వైరల్ వీడియో..

|

Mar 08, 2023 | 8:27 PM

అడవికి రాజు సింహం. దాని ముందు ఎలాంటి జంతువైనా బలాదూరే. వేటాడే తీరు, శక్తియుక్తుల ముందు మరే ఇతర జంతువూ నిలవలేదు. సింహాలు అంటే కేవలం అడవి జంతువులకు మాత్రమే కాదు..

అడవికి రాజు సింహం. దాని ముందు ఎలాంటి జంతువైనా బలాదూరే. వేటాడే తీరు, శక్తియుక్తుల ముందు మరే ఇతర జంతువూ నిలవలేదు. సింహాలు అంటే కేవలం అడవి జంతువులకు మాత్రమే కాదు.. జనాలకూ భయమే. ఈ భూమిపై వేలాది జంతువులు ఉన్నాయి. వాటిలో పాములు కూడా ఉంటాయి. పాము ఎదురుగా కనిపిస్తే చాలు.. అక్కడి నుంచి పారిపోతుంటారు. ఎందుకంటే అవి చాలా విషపూరితమైనవి. కాటు వేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. ఇక.. సింహం, సర్పం రెండూ కలిస్తే.. సీన్ వేరే లెవెల్ ఉంటుంది కదా.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే.వైరల్ అవుతున్న క్లిప్ లో రెండు సింహాలు.. అడవిలో వెళ్తున్నాయి. అదే సమయంలో వారికి ఎదురుగా ఒక పాము వచ్చింది. అంతే ఆ సింహాలు ఆ పామును చూసి అక్కడే ఆగిపోయాయి. నాగు పాము కూడా సింహాలకు ఎదురుగా నిలబడి వాటిని భయపెట్టింది. తర్వాత ఎందుకొచ్చిన గొడవ.. రెండూ కలిసి ఎటాక్‌ చేస్తే నా పని అయిపోతుందనుకుందో ఏమో మెల్లగా అక్కడ్నుంచి జారుకుంది. తర్వాత ఆ రెండు సింహాల మధ్యకు ఓ తొండ ఎంట్రీ ఇచ్చింది. దానిని చూసి ఓ సింహం టచ్‌ చేయబోయింది.. కానీ మళ్లీ ఏమనుకుందో వెనక్కి తగ్గింది. వైరల్ అవుతున్న ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. ఇప్పటికే ఈ వీడియోను 11 వేల మందికి పైగా లైక్‌ చేశారు. అంతేకాదు, ఫన్నీగా కామెంట్ల హోరెత్తిస్తున్నారు. పాములు ఎంత ప్రమాదకరమో సింహానికి కూడా తెలుసునని, అందుకే వెనక్కి తగ్గాయంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 08, 2023 08:27 PM