Couple struck in Lift: పెళ్లి రిసెప్షన్‌కు వెళుతూ.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వధూవరులు..!
అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆత్మీయుల కోసం పెద్ద హోటల్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. పై అంతస్థులోని రిసెప్షన్ హాల్‌కు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు వెళుతుండగా జరిగిన అనుకోని ఘటన..
అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆత్మీయుల కోసం పెద్ద హోటల్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. పై అంతస్థులోని రిసెప్షన్ హాల్‌కు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు వెళుతుండగా జరిగిన అనుకోని ఘటన.. వారు జీవితాంతం నవ్వుకునేలా చేసింది. ప్రణవ్, విక్టోరియా ఝా అనే నూతన దంపతులు తమ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు అమెరికాలోని నార్త్ కరోలినాలోని గ్రాండ్ బొహెమియాన్ హోటల్‌లో లిఫ్ట్ ఎక్కారు. పదహారో అంతస్థులో విందుకు వెళ్లాల్సి ఉంది. వారితో పాటు మరో నలుగురు కూడా ఎలివేటర్‌లో ఉన్నారు. అప్పడే అనుకోకుండా లిఫ్ట్ మొరాయించింది. దాంతో.. రిసెప్షన్‌కు వెళ్లాల్సిన వారు కాస్తా.. రెండు గంటల పైనే లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. లిఫ్ట్ తెరుచుకోలేదు. ఆఖరుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి వారిని ‘హేస్టీ సీట్’ తాళ్లతో సురక్షితంగా బయటకు తీశారు. లిఫ్ట్ ఎక్కాక కొన్ని క్షణాల్లోనే లిఫ్ట్ ఆగిపోయింది. కాకపోతే డోర్ కాస్త తెరుచుకుని ఉంది. దీంతో కాస్త ఊపిరి పీల్చుకోగలిగామని పెళ్లి కొడుకు ప్రణవ్ చెప్పాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!