Fish curry in plastick: ప్లాస్టిక్ కవర్లో వండిన చేపల పులుసు టేస్టే వేరప్ప..!
ఇదేంటి ప్రపంచమంతా ప్లాస్టిక్ నిషేధించమంటుంటే.. మీరేమో ప్లాస్టిక్ కవర్లో వండిన చేపల పుసులు యమరుచిలే అంటున్నారు.. అనుకుంటున్నారా..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెద్దావిడ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఉంది. ఆ పొయ్యికి ఇరు వైపుల రెండు కట్టెలు పాతిపెట్టి ఉన్నాయి. ఈ పెద్దావిడ ఓ ప్లాస్టిక్ కవర్లో మూడొంతులు నీళ్లు నింపి మో కర్రకు దాన్ని తగిలించి పొయ్యికి ఇరువైపుల ఉన్నకట్టెలపైన ఉంచింది. కవరు ఇప్పడు సరిగ్గా పొయ్యిమీద ఉంది. ఇప్పుడు కవర్లోని నీటిలో చేపల పులుసుకు కావలసిన పదార్ధాలన్నీ వేసింది. అలాగే పక్కనే ఓ మట్టి కుండలో ఉన్న చేపను యధావిధిగా అందులో వేసింది. తర్వాత సాల్ట్ వేసింది. ఒక్కడే ఉన్న ఓ తులసి మొక్కలాంటి ఓ ఎండిన కొమ్మను గరిటెలా చేసుకుని దాంతో ఆ చేపల పులుసును కలిపింది. కట్టెల మంటపై వంట పాత్ర లేదా కుండలో కాకుండా ప్లాస్టిక్ కవర్‌లో ఆ పెద్దావిడ చేపల పులుసు వండిన తీరు నెటిజన్లలో పలు ప్రశ్నలు రేకెత్తించింది. ది ఫైజెజ్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 5 లక్షల మందిపైగా వీక్షించారు. అయితే మంట వేడికి ఆ బ్యాగ్ వెంటనే కరిగిపోతుందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అంతటి హీట్‌కూ తట్టుకుని ఉండటం విశేషం. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. ప్లాస్టిక్‌తో కుకింగ్ క్యాన్సర్ ముప్పు పెంచుతుందని పలువురు యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మంట తగిలితే ప్లాస్టిక్ కరిగిపోతుందని అసలు ఇది సాధ్యమా అని మరికొందరు యూజర్లు ప్రశ్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!